Asianet News TeluguAsianet News Telugu

టెన్త్ స్టూడెంట్స్ కు టిఆర్ఎస్ ప్లీనరీ టెన్షన్

టెన్షన్ టెన్షన్..

SSC results postponed to Friday evening due to TRS plenary?

తెలంగాణలో టెన్త్ క్లాస్ పరీక్షలు రాసి ఎప్పుడెప్పుడా అని ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు విద్యార్థులు. వారే కాదు వారి తల్లిదండ్రులు కూడా టెన్షన్ టెన్షన్ గా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ టెన్త్ ఫలితాలు ఫలానా రోజున, ఫలానా టైం కు ప్రకటిస్తామని వెల్లడించింది. దీంతో స్టూడెంట్స్, వారి పేరెంట్స్ టెన్సన్ టెన్షన్ గా క్షణాలు లెక్క పెట్టుకుంటున్నారు.

ఇంతలోనే వారికి ఊహించని కబురు అందింది. టెన్త్ పరీక్ష ఫలితాల విడుదల వాయిదా పడింది. శుక్రవారం ఉదయం విడుదల కావలసిన ఫలితాలను సాయంత్రానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది తెలంగాణ సర్కారు. దీనికి కారణాలు ఏమున్నా.. ఒక కారణం మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. టిఆర్ఎస్ ప్లీనరీ కారణంగానే టెన్త్ ఫలితాలు వాయిదా వేశారని ప్రచారం జోరందుకుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం శుక్రవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. కానీ సర్కారు తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం చూసుకుంటే శుక్రవారం రాత్రి 7 గంటలకు ఉప ముఖ్యమంత్రి ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో ఉన్న దాదాపు ఐదున్నర లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మరో 10 గంటలు టెన్షన్ పడాల్సిన పరిస్థితిని కల్పించారని విద్యార్థులు ఉసూరుమంటున్నారు.

శుక్రవారం ఉదయం 10గంటలకు ఫలితాలిస్తామని ముందుగా సర్కారు ప్రకటించకుంటే విద్యార్థులు టెన్షన్ పడే వారు కాదు కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. కాని ఒకసారి చెప్పి టైం మార్చితే నే సమస్య ఉంటుందని అంటున్నారు. శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ జరుగనుందని, ఈ కారణంగా ఫలితాలు వాయిదా వేసినట్లు టెన్త్ పరీక్ష రాసిన విద్యార్థి తండ్రి జితేందర్ రెడ్డి అనే వ్యక్తి ఏషియానెట్ తో ఆవేదన వ్యక్తం చేశారు. మరి పార్టీ ప్లీనరీ సమావేశాల ముగింపు ఆలస్యం అయితే ఏమి చేస్తారని ఆయన ప్రశ్నించారు.

మొత్తానికి టిఎస్పిఎస్సీ ఉద్యోగాల ప్రక్రియ మాదిరిగానే టెన్త్ ఫలితాలు మారతాయా అన్న భయం స్టూడెంట్స్ లో, వారి తల్లిదండ్రుల్లో నెలకొందని చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios