వరంగల్ జనాలకు షాక్ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ శృతి ఓఝా నగరంలో ఆకస్మిక పర్యటన చెత్త తొలగించకపోవడంపై సీరియస్ జనాలకు సైతం స్ట్రాంగ్ వార్నింగ్  

వరంగల్ జిల్లాలో పరిపాలనలో మహిళా ఐఎఎస్ అధికారులు పోటీ పడుతున్నారు. వారిలో ఒకరు కలెక్టర్ ఆమ్రపాలి అయితే మరొకరు వరంగల్ నగర కమిషనర్ శృతి ఓఝా. వీరిద్దరూ యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్లు కావడంతో పాలన కొత్త పుంతలు తొక్కుతున్నది. ఇంతకూ ఆమ్రపాలిని మించిపోయేలా శృతి ఏం చేశారబ్బా అని మీకు డౌట్ కొట్టిందా? అయితే ఈ న్యూస్ చదవండి.

వరంగల్ మహానగరంలో పారిశుద్ధ్యం విషయంలో కమిషనర్ శృతి ఓఝా పక్కాగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో మున్సిపల్ అధికారులు ఎలా పనిచేస్తున్నారనేదానిపై ఆమె సోమవారం తెల్లారుగట్ల నగరంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హన్మకొండ లోని పలు కాలనీల్లో ఆమె తిరిగి హల్ చల్ చేశారు.

అయితే అయా కాలనీల్లో పారిశుద్ధ్యం కొరవడిన విషయాన్ని గుర్తించారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోయినట్లు గుర్తించారు కమిషనర్. దీంతో మున్సిపల్ అధికారులపై సీరియస్ అయ్యారు. తక్షణమే స్థానికంగా బాధ్యులైన సిబ్బంది మీద వేటు వేశారు. శానిటరీ సూపర్ వైజర్ ను సస్పెండ్ చేశారు. గ్రౌండ్ లెవల్ లో ఆశించిన రీతిలో పరిశుభ్రత విషయంలో సిబ్బంది పనితీరు బాగాలేదని మండిపడ్డారు కమిషనర్ శృతి.

ఇక మీదట ఎక్కడ రోడ్ల మీద చెత్త వేసినా? చెత్త వేసిన వారి మీద క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. ఆ దిశగా మున్సిపల్ అధికారులు చెత్త వేసే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు. రోడ్ల మీద చెత్త కాల్చే వారిపై కూడా క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. అలాగే ఏ రోడ్డు మీద చెత్త కనబడితే ఆ జవాన్ ను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఇక మీదట నగరంలో క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు తరుచుగా ఉంటాయని అన్నారు కమిషనర్ శృతి ఓఝా.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/Xh3cbG