పవన్ కళ్యాణ్ కు శ్రీ రెడ్డి మరో షాక్

పవన్ కళ్యాణ్ కు శ్రీ రెడ్డి మరో షాక్

తెలుగు సినీ పరిశ్రమలో పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్. ఆయన తాజాగా రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. ఎపిలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజనా మోస్తున్నారు. ఎపి రాజకీయ పార్టీలనే కాదు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలను సైతం కలవరపాటుకు గురిచేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో ఆయనపై యాంకర్ శ్రీరెడ్డి మరోసారి శ్రీరెడ్డి ఫైర్ అయ్యారు. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మీద శ్రీరెడ్డి పంచ్ లు, సెటైర్లు వేశారు. కానీ ఈసారి పవన్ కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు శ్రీరెడ్డి. ఆయన ఫ్యాన్స్ కూ మింగుడుపడని విమర్శ గుప్పించారు. శ్రీరెడ్డి ఏమన్నారో.. ఏ విషయంలో ఆమె ఎందుకు అంతగా రియాక్ట అయ్యారో? చదవండి.

పవన్ కళ్యాణ్ నెక్లెస్ రోడ్డులో మెరుపు దీక్ష చేపట్టారు. ఆసీఫా దారుణ హత్యపై పవన్ ఎమోషనల్ గా స్పందించారు. అలాంటి దుష్టులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక పవన్ ఆ రకమైన డిమాండ్ చేసిన మరుక్షణమే శ్రీరెడ్డి ఫేస్ బుక్ లో రంగ ప్రవేశం చేశారు. తన వాల్ మీద పవన్ పై స్రాంగ్ పంచ్ వేస్తూ పోస్టు పెట్టారు. ఆమె పోస్టు యదాతదంగా కింద ఉంది చదవండి.

మరి శ్రీరెడ్డి పోస్టుపై పవన్ వ్యతిరేకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి లక్షల సంఖ్యలో ఉన్న పవన్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos