ఖమ్మం: గత నెల 21వ తేదీన లండన్‌లో అదృశ్యమైన ఖమ్మం విద్యార్ధి శ్రీహర్ష కథ విషాదంగా ముగిసింది. లండన్ బీచ్ ఒడ్డున మంగళవారం నాడు ఉదయం గుర్తు తెలియని మృతదేహన్ని లండన్ పోలీసులు గుర్తించారు.

శ్రీహర్ష తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని లండన్ పోలీసులు ఇచ్చారు. మృతదేహం వద్ద దొరికిన దుస్తులు, పర్సు చూసిన తల్లిదండ్రులు శ్రీహర్షగా గుర్తించారు. శ్రీహర్ష మృతిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

శ్రీహర్ష ఆత్మహత్య  చేసుకొన్నాడని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఖమ్మం నగరానికి చెందిన శ్రీహర్ష క్వీన్స్ యూనివర్శిటీలో పీజీ చదివేందుకు లండన్ వెళ్లాడు.  శ్రీహర్ష తండ్రి ఉదయ్‌ప్రతాప్ ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు.

శ్రీహర్ష గత నెల 21వ తేదీన లండన్ బీచ్ కు వెళ్లి కన్పించకుండా వెళ్లిపోయాడు. శ్రీహర్ష  ఆచూకీ కోసం కుటుంబసభ్యులు ఎదురు చూశారు.లండన్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో శ్రీహర్ష మృతి చెందినట్టుగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

లండన్ లో బీజేపీ నేత కుమారుడు మిస్సింగ్.. టీఆర్ఎస్ ఎంపీ ఆరా