లండన్ లో తెలుగు విద్యార్థి హర్ష అదృశ్యమయ్యాడు. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కుమారుడు హర్ష.. ఉన్నత విద్యనభ్యసించాలనే ఉద్దేశంతో లండన్ వెళ్లారు. కాగా  అక్కడ కనిపించకుండా పోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన అక్కడి హర్ష స్నేహితులు తాజాగా కుటుంబ సభ్యులకు వివరించారు.

కాగా.. విద్యార్థి హర్ష కనిపించకుండా పోవడంపై అతని కుటుంబస్యులు కలవరపడతున్నారు. హర్ష లండన్ లో పీజీ చదువుతున్నాడని అతని కుటుంబసభ్యులు చెప్పారు. ఇప్పటికే ఈ హర్ష మిస్సింగ్ పై లండన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. 

జీవీమాల్‌ అధినేత గుర్రం ఉమామహేశ్వరరావు ద్వారా విషయం తెలుసుకున్న ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు.. ఫోన్‌లో శ్రీహర్ష తండ్రి ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సన్నె ఉదయ్‌ప్రతాప్‌, బంధువులతో మాట్లాడారు. విదేశాంగశాఖ అధికారులతో, లండన్‌లో ఉన్న తెలుగువారితో మా ట్లాడుతాననిచెప్పారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్లు చెప్పారు. .. హర్ష ఆచూకీ కనుగొనేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.