శ్రీ రెడ్డి సంచలన నిర్ణయం.. వార్నింగ్ ల జోరు

Sri Reddy makes serious comments on film personalities
Highlights

అర డజను మందిని టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి.. వారి పేర్లు ఇవే

సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన శ్రీరెడ్డి తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై సోషల్ మీడియాలో అసభ్యంగా కామెంట్లు చేసిన వారిని ఒక్కరిని కూడా వదలకుండా కోర్టుకు లాగుతానని హెచ్చరించారు శ్రీరెడ్డి. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో శ్రీ రెడ్డి, ఆమె అడ్వొకెట్ గోపాల కృష్ణ కళానిధి మీడియాతో మాట్లాడారు. ముందుగా అడ్వొకెట్ గోపాల కృష్ణ కళానిధి ఏమన్నారో కింద చదవండి.

శ్రీ రెడ్డి కి సంబంధించి ఇంతవరకు పెట్టిన వీడియోలపై అసభ్యంగా కామెంట్లు చేసిన వారిని కోర్టులకు లాగుతాం. మహిళ అని చూడకుండా ఆమె వీడియోలను అసభ్యంగా పెట్టినవారు, అలాగే కామెంట్లు పెట్టిన వారిపై కేసులు పెట్టబోతున్నాం. సుప్రీంకోర్టులో పిల్ వేస్తాం, ఇందులో మా అసోసియేషన్, జూనియర్ ఆర్టిస్టులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఇలా ఎవరు కామెంట్ చేసినా వారిపై కేసులు పెడతాం. వారిపై క్రిమినల్ కేసులు, సైబర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం.

శ్రీరెడ్డి మాటలు కింద చదవండి...

శ్రీరెడ్డి డబ్బు తీసుకున్నట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నవారు నిరూపించాలని సవాల్ చేశారు. అభిరాం విషయంలో డబ్బులతో సెటిల్మెంట్ చేద్దామని డైరెక్టర్ తేజ తో పాటు సినిమా పెద్దలు కొంత మంది నన్ను సంప్రదించారు. కానీ నేను ఎవరి దగ్గర నుండి ఒక్క రూపాయి తీసుకోలేదు. తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికి అయినా సిద్ధమే. సినిమా ఇండస్ట్రీ లో పెద్ద ఆర్టిస్టులను ఒక లాగా, చిన్న ఆర్టిస్టులను మరోలా చూస్తున్నారు. మీడియా మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. నేను ఎవరికి భయపడను. సినిమా ఇండస్ట్రీ లో మహిళలకు అన్యాయం చేస్తున్న ప్రతి ఒక్కరినీ బైటికి లాగుతా. కాష్ కమిటీ ఏర్పాటు చేస్తా అన్నారు. దాంట్లో అభిరామ్ సోదరుడు రానా ఉండటం ఎంత వరకు కరెక్ట్? కోన వెంకట్ కు సవాల్ విసురుతున్నాను.. హీరో నాని, శేఖర్ కమ్ముల మీరు ఏంచేస్తున్నారో నాకు తెలుసు. రాబోయే రోజుల్లో అన్ని ఆధారాలు బైట పెడతా జాగ్రత్త. ఇప్పటి వరకు వేధింపులకు గురైన ప్రతి అమ్మాయి బైటికి వస్తుంది.

మేకప్ మాన్ లు కూడా నాకు కాల్ చేసి వారి సమస్యలను చెప్తున్నారు. ఇన్ని జరుగుతున్న మీరు ఎందుకు మాట్లాడారు? నాలాంటి మహిళల కోసం నేను ఈరోజు తెగించి వచ్చాను. నేను ఎయిడ్స్ వచ్చి పోయానంటా... ఇన్ని మాటలు అంటున్నారు నన్ను. కోన వెంకట్ నీకు ఒకటి చెప్తున్న నీ సంగతి చూస్తా..పట్టాభి గారు వచ్చి మీ తోలు తీస్తారు. మాకు వచ్చిన కోపానికి మీరందరు శిక్ష అనుభవించాలి. కోనా వెంకట్ చూసుకుందాం నువు ఏం చేశావో నాకు తెల్సు. నువు ఏ తప్పు చేయకపోతే పోరాడు. నానీ, శేకర్ కమ్ముల పేర్లు కూడా బయటకు తీస్తా.

loader