స్థలం ఇవ్వండి, కాలంతో పోటి పడుతాం : శ్రీకృష్ణ యాదవ ట్రస్ట్

Sri Krishna Yadav trust appeals to minister Jagadish Reddy for land allocation
Highlights

మంత్రి జగదీష్ రెడ్డికి వినతి

కాసింత స్థలం ఇవ్వండి కాలంతో పోటి పడుతామంటూ సూర్యాపేట జిల్లా శ్రీకృష్ణా యాదవ ట్రస్ట్ కార్యవర్గం రాష్ట్ర విద్యుత్, యస్.సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కి విన్నవించుకున్నారు.

గురువారం ఉదయం రాజ్యసభసభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, సూర్యాపేట యం.పి.పి వట్టె జానయ్య యాదవ్, జిల్లా గొర్రెల కాపరుల సంఘం అధ్యక్ష్యులు పోలేబోయిన నర్సయ్యల అధ్వర్యంలో ట్రస్ట్ కార్యవర్గం మంత్రి జగదీష్ రెడ్డిని కల్సి వినతి పత్రాన్ని అందచేశారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో తమ అధినంలో ఉన్న ట్రస్ట్ కు ప్రభుత్వ పరంగా స్థలం కేటాయించిన పక్షంలో కాలంతో పోటి పడేందుకు ప్రణాళికలు రుపొందించుకున్నామని వారు మంత్రి జగదీష్ రెడ్డి కి విన్నవించుకున్నారు.

ప్రధానంగా యాదవల కుల వ్రుత్తిలో బాగంగా గొర్రెల పెంపకం దారులకు అధునాతన వైద్య రంగంలో శిక్షణా కేంద్రాన్ని ప్రారంబిన్చుకోనున్నట్లు వారు పేర్కొన్నారు. అంతేకాకుండా బాల్య వివాహాలు,మూడ నమ్మకాలపై అవగాహనా సదస్సులను ఏర్పాటు చేసుకోవడానికి తాము నిర్మించబోయే భవనం దోహద పడుతుందని వారి వివరించారు.

యాదవ యువత పోటి పరీక్షల శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పేందుకు ఈ భవనం ఉపయోగకరంగా ఉంటుందని వీటి దృష్ట్యా మేము నిర్మించబోయే భవనానికి వెంటనే స్థలం మంజురు చెయ్యగలరని వారు మంత్రికి ఇచ్చిన వినతి పత్రంలో కోరారు.

loader