పాఠశాలలో పుస్తకాలు, అడ్మిషన్లు కోసం ఫీజులు వసూలు చేస్తుండడంతో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి విషయాన్ని మండల విద్యాధికారి బాబూ సింగ్‌కు తెలియజేశారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించి అడ్మిషన్లు ప్రారంభించి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలను బుధవారం విద్యాధికారి సీజ్‌ చేశారు. పాఠశాలలో పుస్తకాలు, అడ్మిషన్లు కోసం ఫీజులు వసూలు చేస్తుండడంతో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి విషయాన్ని మండల విద్యాధికారి బాబూ సింగ్‌కు తెలియజేశారు.

 ఎంఈవో పాఠశాలను తనిఖీ చేసి సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి సతీష్‌ మాట్లాడుతూ,  ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాతనే పాఠశాలలు తెరవాలని, లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎ్‌ఫఐ డివిజన్‌ కార్యదర్శి అక్బర్‌, నాయకులు సుభాష్‌ పాల్గొన్నారు.