Asianet News TeluguAsianet News Telugu

కేసిఆర్ చెట్ల మీదే ఇస్తార్లు కుట్టే బాపత్

  • సౌత్ కాంక్లేవ్ మీడియా డిబేట్ లో మోసపూరిత మాటలు, అబద్దాలు
  • రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తూ.. దేశంలో నే నెంబర్ వన్ అంటారా
  • కబ్జాకోరులతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారు
  • మీ పాలన నీతివంతమైనదైతే...కర్ణాటకతరహాలో లోకపాల్ అమలు చేస్తారా
sravan dasoju fire on cm comments

కేసిఆర్ పార్క్ హయాత్ హోటల్ లో జరిగిన ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్ డిబేట్ లో మాట్లాడిన మాటలపై పిసిసి ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ సీరియస్ అయ్యారు. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారో మాటల్లోనే చదవుదాం..  అబద్దాలు,  ఆరోపణలతో వాస్తవాలను వక్రీకరించి, నిజాలను మరుగు పరిచే ప్రయత్నం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేశారు. తన అసమర్ధతను, అవినీతిని అణిచివేత ధోరణిని కప్పిపుచ్చుకునేందుకు కాంక్లేవ్ సమావేశాన్ని ఉపయోగించుకున్నరు. 

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తూ.. దేశంలో నే నెంబర్ వన్ అంటారా? 
రాష్ట్రం ఏర్పడేనాటికి 60 వేల కోట్ల రూపాయల అప్పులుంటే గడిచిన మూడేళ్లలో 90 వేలకోట్ల అప్పులు తెచ్చి తెలంగాణా రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణా గా మార్చారు. మరోవైపు తామేదో ఘనత సాధించామన్నట్లు చైనా నుంచి మరో 25 వేల కోట్ల అప్పులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నమని, కేటీయార్ అరబ్ షేక్ లనుంచి మరో 30 వేల కోట్ల అప్పులు తెస్తామని చెప్పడం సిగ్గుచేటు. అప్పులతో పాటు తాగుబోతుల రాష్ట్రంగా మారుస్తున్నరు. ప్రజలను  మభ్యపెడుతూ, మానేజ్ మెంట్ పాలిటిక్స్ రాష్ట్రంలో ఇంకెన్నాళ్లు కొనసాగిస్తరు?  తెలుగు భాషకు గుర్తింపే లేదని మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీయార్ 200 వందల కోట్లు ఖర్చు చేసి దేశవ్యాప్తంగా అట్టహాసంగా ప్రచారం చేసి ప్రపంచ తెలుగు మహాసభలను ఎందుకు నిర్వహించారు? ఎవరి మెప్పుకోసం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు అభిమానులనుపిలిచారని.. నిమా వాళ్లతో ఎందుకు సన్మానాలు చేయించుకున్నాకున్నారో స్పష్టం చేయాలి.

కబ్జాకోరులతో చెట్టాపట్టాల్
ఆంధ్రాపెట్టుబడి దారుల వల్లే తెలంగాణా అబివృద్ది అయింది రాష్ట్రం ఏర్పాటయితే వాళ్లంతా వెళ్లిపోతారని చెప్పారని రాజ్ దీప్ ప్రశ్నిస్తే అభివృద్ది అంతా నిజాం కాలంలోనే జరిగిందని కేసిఆర్ అన్నారు. రాజులు కట్టిన మేడలన్ని పేదవాడి కన్నీళ్లేనని టాక్స్ రూపంలో వారి చెమటను రక్తాన్ని పీల్చిచేసిందే కదా? తెలంగాణాను దోచుకుంటున్నది ఆంధ్రావాళ్లేనని జాగో బాగో నినాదం ఇచ్చింది కేసీయారే కదా? వరంగల్ సభలో ఆంధ్రావాళ్లును ఉద్దేశించి లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులేనని చెప్పింది కేసీఆర్ కాదా? నిజానికి ఇక్కడ కాయకష్టం చేసుకునే వారే తెలంగాణా విడిచే పరిస్ధితి నెలకొంది. కబ్జాకోరులు, దోపిడి దారులను కేసిఆర్ తనవెంటే పెట్టుకున్నారు. అయ్యప్పసోసైటీలో అక్రమాలతో పాటు , సినీ హీరో నాగార్జున  పెద్ద కబ్జాకోరంటూ చెప్పింది ఎవరు? తెలంగాణా భూములను వనరులను దోచుకు తిన్న రాఘవేందర్ రావు, మోహన్ బాబు, రామోజీరావు, లగడపాటి లాంటి వారితో చెట్టాపట్టాల్ వేసుకుతిరుగుతోంది కేసీయార్ కాదా?

మోసాలు అబద్దాలతో పాలన ఎన్నాళ్లు
జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో 140 సీట్లు గెలిచినమంటున్న కేసీయార్ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రాజకీయ వ్యభిచారానికి పాల్పడి, పక్కపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ను కొనుగోలు చేసి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అభాసుపాలు చేసే ప్రయత్నం చేశారు.  హైదరాబాద్ ను రెండో రాజధానిగా ప్రకటించే అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణా పూర్తిగా సర్వనాశనం అయ్యే పరిస్థితి నెలకొంటుందని  గతంలో కేంద్రపాలిత ప్రాంతంగా మారుతుందని వ్యతిరేకించిన కేసీయార్ ఏకపక్షంగా,హేతుబద్దమైన చర్చలు లేకుండా స్వాగతిస్తామని చెప్పడం తీవ్ర అభ్యంతరకరం. రెండో రాజధాని వస్తే అభివృద్దితో పాటు తీవ్రమైన నష్టాలు కూడా వస్తాయని మరవడం మంచిది కాదు.

గొర్రెలు బర్రెలు మాకెందుకు ఉద్యోగాలే ఇవ్వాలి
గుజరాత్ మోడల్ అంటూ గొర్రెలు బర్రెలు పెంచుతున్నమని చెపుతున్న కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి. గ్రామీణ ప్రాంత అభివృద్ది  2013..14 లొ 21 శాతం ఉంటే... ప్రస్తుతం 18.5 శాతంకు దిగజారితే అభివృద్ది ఎలా సాధ్యమో చెప్పాలి. కొన్ని జిల్లాలు మినహా మిగితా జిల్లలో ఎందుకు జీడీపి వృద్ది ఎందుక పెరగలేదో చెప్పలేదు. 35లక్షల గొర్రెలు ఇస్తే వాటికి పదమూడు లక్షల గొర్రెలు పుట్టినయిని చెప్పడం చెట్లమీద ఇస్తార్లు కుట్టిన చందంగా ఉంది. బడుగు బలహీన వర్గాల పిల్లలు మంచి విద్య, ఉపాది అవకాశాలు కావాలని కోరుకుంటున్నరు తప్న గొర్రెలు బర్రెలు కావాలని కోరుకోవడం లేదు. తెలంగాణా ఏర్పాటు నాటికి కేవలం 6000 వేల మెగావాట్ల ఇన్స్టాల్ కెపాసిటి ఉంటే 14 వేల మెగావాట్ల కెపాసిటి పెంచామని అబద్దాలు చెబుతున్నరు. 2020 వరకు 20 వేల మెగావాట్ల కెపాసిటీకి పెంచుతున్నమంటున్నరని టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 2000 వేల మెగావాట్ల సామర్ధ్యం కలిగిన భద్రాద్రి,యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ లు మాత్రమేప్రారంభించింది. మరి అదనంగా విద్యుత్తు ఎక్కడినుంచి ఉత్పత్తి చేస్తారో చెప్పాలి. దేశంలో ఎన్నో విద్యుత్ కంపెనీలు అతి తక్కవ ధరలకే విద్యుతు అందిస్తామంటున్నా పట్టించుకోకురా? ఇక రైతు ఆత్మహత్యల్లో అతి ఎక్కువ ఆత్మహత్యలు కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లో జరిగాయి. కాంగ్రెస్ హయాంలో 890 మంది చనిపోతే మీ హయాంలో 1390 మంది చనిపోయారని ప్రశ్నిస్తే సమాధానం చేప్పకుండా దాటవేశావు కదా? ఏ ఒక్క రైతు కుటంబాన్ని ఆదుకోలేదని కనీసం పరామర్శలు కూడా చేయలేని ప్రభుత్వం కేసీయార్ దే అని తేలిపోయింది.

మీ పాలన నీతివంతమైనదైతే...కర్ణాటక తరహాలో లోకపాల్ అమలు చేస్తారా?
సాగునీటి ప్రాజెక్ట్ లను రీడిజైనింగ్ ల పేరిట దాదాపు పూర్తయిన ప్రాజెక్ట్ లను దోపిడి కి తెరలేపిన్రు. హెచ్ టీ కాటన్ పేరిట కల్తీ విత్తనాలతో రైతులను నట్టేట ముంచుతున్నరని పత్తి విత్తనాలు తీసుకున్న రైతులు పిట్టల్లా రాలిపోతున్నరు. హైదరాబాద్ లో ఒక్క చెరువును పునరుద్దరించలేదు. గచ్చిబౌలి, గండిపేట చెరువులు దాదాపు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. దిరాపార్క్, ఎన్టీయార్ స్టేడియాలను వాస్తు పిచ్చి పేరుతో ఆక్రమించేందుకు కుట్రలు పన్నుతున్నవు. వాస్తుపేరిట మరో వంద సంవత్సరాలకు పనికోచ్చే సెక్రటేరియట్ కూల్చేస్తామని పనికి మాలిన నిర్ణయాలు చేయడం సబబు కాదు. చార్మినార్ కు మసిబారిందని కూల్చేస్తామా? 5వేల కంపెనీలకు అనుమతించిన మంటూనే మరో 5 వేల కంపెనీలనుమూసివేసేందుకు కారణమయ్యారు. గతంలోహమీ ఇచ్చిన నిజామ్ షుగర్ ప్యాక్టరీ, సిర్పూర్ కాగజ్ నగర్ మిల్లు తెరిపించలేక పోయారు. అడుగడుగునా అవినీతికి పాల్పడుతూ పారదర్శక పాలన అందిస్తున్నమంటున్న కేసీయార్ చిత్తశుద్ది ఉంటే కర్ణాటక తరహ లోక్ పాల్ పరిధిలోకి తన ప్రభుత్వాన్ని తెచ్చి తన నిజాయితీ  నిరూపించుకోవాలి. కేసిఆర్ చెేస్తున్నది గోరంతయితే చెప్పేది కొండంత లా ఉంటోంది.

Follow Us:
Download App:
  • android
  • ios