న్యూఢిల్లీ: రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్  తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చింది.  ఈ వ్యాక్సిన్ ధరను  రూ. 995.40 గా నిర్ణయించారు.స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ను హైద్రాబాద్ లో దీపక్ సప్రా అనే వ్యక్తికి శుక్రవారం నాడు ఇచ్చారు. ఇండియాలో డాక్టర్ రెడ్డీస్ స్పుత్నిక్ వ్యాక్సిన్ ను తయారు చేస్తోంది. గత నెలలోనే  స్పుత్నిక్ వ్యాక్సిన్ కు డీసీజీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.  కరోనాపై  91.6 శాతం ఫలితాలను ఇస్తున్నాయని వ్యాక్సిన్ పై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ తెలిపినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. 

&

nbsp;

 

స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ను హైద్రాబాద్ లో ఇవాళ డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీ ప్రారంభించింది.  ఈ వ్యాక్సిన్ పై ఐదు శాతం జీఎస్టీని విధించారు. వచ్చే వారంలో ఈ వ్యాక్సిన్ మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. కరోనా వ్యాక్సిన్ కొరతను తీర్చేందుకు గాను స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతిచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 13న ఇండియాలోకి  స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కు డీసీజీఐ అనుమతిని ఇచ్చింది. ఈ నెల 1వ తేదీన రష్యా నుండి వ్యాక్సిన్ ఇండియాకు వచ్చింది.