Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ స్పిరిట్ కు మరో దెబ్బ.. అడ్మిన్ అరెస్ట్

తెలంగాణ బర్నింగ్ న్యూస్..
sprit of telangana admin arrest

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు చాటిచెప్పేందుకు తెలంగాణవాదులు స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అనే ఫేస్ బుక్ లో ఒక గ్రూప్ ను, అదే పేరుతో పేజీని క్రియేట్ చేశారు. ఈ గ్రూప్ తెలంగాణ ప్రజలను చైతన్యం చేయడంలో తనవంతు పాత్ర పోశించింది. అయితే ఇటీవల కాలంలో స్పిరిట్ కు వరుస ఎదురు దెబ్బలు తాకుతున్నాయి. ఉమ్మడి రాష్ట్ర సర్కారే సోషల్ మీడియా యాక్టవిస్ట్ ల మీద కేసులు పెట్టేందుకు భయపడిన సమయంలో తెలంగాణ సర్కారు స్పిరిట్ ఆఫ్ తెలంగాణపై పగ సాధించడమేంటని సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు ప్రశ్నిస్తున్నారు.

ఇటీవల కాలంలో స్పిరిట్ ఆఫ్ తెలంగాణ పేజీని వ్యూహాత్మకంగా తెలంగాణ సర్కారు బ్లాక్ చేయించిందన్న ప్రచారం జరిగింది. కాపీ కంటెంట్ పేరుతో ఒక టివి చానెల్ ద్వారా స్పిరిట్ ఆఫ్ తెలంగాణ పేజీని బ్లాక్ చేయించారని గ్రూప్ సభ్యులు ఆరోపించారు.

అయితే తాజాగా మరో ఎదురుదెబ్బ స్పిరిట్ కు తాకింది. ఈ గ్రూప్ అడ్మిన్ గా ఉన్న ప్రశాంత్ ను తెలంగాణ పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్టు చేశారు. బంజారాహిల్స్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పక్క వీధిలో ఉన్న సైబర్ హైట్స్ లో ఉన్న ఫ్లాట్ నెంబర్ 501లో ప్రశాంత్ ను మఫ్టీలో వచ్చిన పోలీసులు తీసుకు పోయినట్లు చెబుతున్నారు.

పాలక పక్షాల వైఫల్యాలను ఎత్తి చూపడమే నేరంగా భావించి ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్నారని స్పిరిట్ ఆఫ్ తెలంగాణ గ్రూప్ సభ్యులు చెబుతున్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రజల తరుపున ప్రశాంత్ పోరాటం చేశారు. ప్రశాంత్ అరెస్టుతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇలా చేయడం పట్ల తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రశాంత్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios