స్పోర్ట్స్ కోటా మెడికల్ సీట్ల కుంభకోణం : శాట్స్ అధికారి వెంకటరమణ అరెస్ట్

Sports quota scam: Telangana sports Dy chief in ACB net for bribe
Highlights

మరికొంత మంది అధికారుల ఇళ్లలో కూడా ఎసిబి సోదాలు

స్పోర్ట్స్ కోటాలోని ఎంబీబిఎస్ సీట్ల కేటాయింపులో అవకతవకలకు పాల్పడ్డ శాట్ అధికారులపై ఎసిబి అధికారులు దాడులు చేశారు. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శాట్స్ డిప్యూటి డైరెక్టర్, ధ్రువ పత్రాల పరిశీలన అధికారి వెంకటరమణ ఇంట్లో నిన్న ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో దొరికిన ప్రాథమిక ఆదారాల ఆధారంగా ఆయన్ని అవినీతి నిరోదక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఇందులో మరికొంత మంది శాట్ అధికారుల పాత్రపై అనుమానాలున్నాయని, దీనిపై సమాచారం సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

స్పోర్ట్స్ కోటాలో ఎంబీబిఎస్ సీట్ల కేటాయింపు లో తమకు అన్యాయం జరిగిందని ఇద్దరు క్రీడాకారులు ఎసిబి కి పిర్యాధు చేయడంతో ఈ కుంభకోణం బైటికి వచ్చింది. భరత్‌చంద్రారెడ్డి, వర్షితారాజ్‌ అనే క్రీడాకారులు ఈ పిర్యాదు చేశారు. తన కొడుకుకు స్పోర్ట్స్ కోటాలో సీటు కోసం శాట్స్ అధికారి వెంకటరమణ భరత్ చంద్రారెడ్డి నుండి  రూ.లక్ష లంచంగా తీసుకుని అతడి పేరును ప్రాధాన్య జాబితాలో చేర్చాడు. అయితే సీటు రావాలంటే మాత్రం ఇంకా ఎక్కువ డబ్బులు ముట్టజెప్పాలని వెంకటరమణ డిమాండ్ చేశాడు. అలా డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో భరత్ పేరును జాబితాలోంచి తొలగించాడరు. దీంతో అతడు సాక్ష్యాదారాలతో సహా ఎసిబికి పిర్యాదు చేయడంతో ఈ విషయం బైటపడింది.

ఈ మెడికల్ సీట్ల కుంభకోణంతో సంబంధాలున్నట్లు ఆరోపణలున్న వెంకటరమణ, ఎ అండ్‌ ఎస్‌ఎస్‌ ఇన్‌ఛార్జ్‌ మనోహర్‌, డిప్యూటీ డైరెక్టర్‌ శోభ, సైక్లింగ్‌ వెలొడ్రోమ్‌ పరిపాలనాధికారి చంద్రారెడ్డి, శాట్స్‌ పరిపాలనాధికారి విమలాకర్‌రావుల ఇళ్లపై కూడా నిన్న ఎసిబి అధికారులు  దాడులు చేసింది. అలాగే ఎల్బీ స్టేడియంలోని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించి 4 కంప్యూటర్లు, రికార్డుల్ని సీజ్‌ చేసింది. 

ఈ వ్యవహారంలో ముఖ్యపాత్ర వహించిన వెంకటరమణను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు విచారణ కోసం ఆయనను తమ కస్టడీకి తీసుకోనున్నారు. ఈయన్ని విచారిస్తే మొత్తం కుంభకోణానికి సంబంధించిన వారంతా బైటికి వస్తారని ఎసిబి బావిస్తోంది. 

 
 

loader