Asianet News TeluguAsianet News Telugu

లేడీస్ సీట్లలో కూర్చుంటే.. ఇక అంతే

మహిళలు, సీనియర్‌ సిటిజన్లు, వికలాంగులకు ప్రత్యేకించిన సీట్లలో ఇతరులెవరైనా కూర్చుంటే రూ.500 జరిమానా వేస్తామన్నారు.

specail rule in metro rail hyderabad over women seats
Author
Hyderabad, First Published Oct 23, 2018, 9:50 AM IST


హైదరాబాద్ మెట్రోలో ఓ కొత్త నిబంధనను తీసుకువచ్చింది. మహిళల కోసం  కేటాయించిన సీట్లలో ఇతరులు కూర్చుంటే జరిమానా విధించనున్నట్లు హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. 

సోమవారం మెట్రోరైల్‌ భవన్‌లో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. మహిళలు, సీనియర్‌ సిటిజన్లు, వికలాంగులకు ప్రత్యేకించిన సీట్లలో ఇతరులెవరైనా కూర్చుంటే రూ.500 జరిమానా వేస్తామన్నారు. ప్రతీ బోగీలో ఎల్‌అండ్‌టీ భద్రతా సిబ్బంది, పోలీసు నిఘాను అధికం చేస్తామని వివరించారు. 

ఈ విషయంలో మహిళా ప్రయాణికులు తమకెదురయ్యే అసౌకర్యాన్ని తెలియజేసేందుకు  ఓ వాట్సాప్‌ నంబరును కేటాయించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ నిర్ణయాలను త్వరలో అమలు చేస్తామని ఎల్‌అండ్‌టీ అధికారులు హామీ ఇచ్చారు. మెట్రోస్టేషన్ల పరిసరాలను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎన్వీఎస్‌ రెడ్డి ఆదేశించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios