కాగజ్‌నగర్:   ఎఫ్‌ఆర్ఓ అనితపై  దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకొంటామని  కొమరం భీమ్ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎఫ్ఆర్ఓను  అటవీ శాఖ ఉన్నతాధికారులు పరామర్శించారు.

ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మల్లారెడ్డి స్పందించారు. ఎఫ్ఆర్‌ఓపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తప్పవన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కృష్ణతో పసాటు ఆయన అనుచరులు ఎఫ్ఆర్ఓ అనితతో పాటు తమ సిబ్బందిపై దాడి చేశారని  డిఎఫ్ఓ చెప్పారు. 

తనపై జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ కృష్ణ దాడికి పాల్పడ్డాడని ఎఫ్ఆర్ఓ అనిత ఆరోపిస్తున్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అటవీ ప్రాంతం ముంపుకు గురికావడంతో  ప్రత్యామ్నాయ స్థలాల్లో అడవులను పెంచేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.

 ఇందులో భాగంగానే ఆదివారం నాడు సార్సాలో మొక్కలు నాటేందుకు వీలుగా భూమిని చదును చేస్తుండగా కృష్ణతో పాటు ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారని అటవీ శాఖాధికారులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

నేను దాడి చేయలేదు, వాళ్లే దాడి చేశారు: జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ కృష్ణ

మహిళా ఫారెస్ట్ అధికారిని చితకబాదిన జడ్పీ వైఎస్ ఛైర్మన్ (వీడియో)