అఖిలేష్ హైదరాబాద్ టూర్.. షాకింగ్ ట్విస్ట్ (వీడియో)

SP activists unhappy with Telangana police for not allowing to meet Akhilesh Yadav
Highlights

హైదరాబాద్ పోలీసులు ఏం చేశారంటే ?

లక్నో నుంచి రెక్కలు కట్టుకుని హైదరాబాద్ వచ్చారు యూపి మాజీ సిఎం అఖిలేష్ యాదవ్. కానీ హైదరాబాద్ లో ఆయన కాలు పెట్టగానే ఇక్కడ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అఖిలేష్ తెలంగాణ సిఎం కిసిఆర్ తో భేటీ అయ్యేందుకు ప్రగతిభనవ్ వెళ్లారు. అయితే అఖిలేష్ యాదవ్ కు స్వాగతం పలికేందుకు సమాజ్ వాదీ పార్టీ తెలంగాణ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. కానీ తెలంగాణ పోలీసులు మాత్రం వారిని అనుమతించలేదు. మరి టిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులందరినీ ఆహ్వానం పలికేందుకు అనుమతించిన పోలీసులు తమను ఎందుకు అనుమతించడంలేదని సమాజ్ వాదీ పార్టీ తెలంగాణ కార్యకర్తలు సీరియస్ అయ్యారు. అయితే ఈ సందర్భంగా పోలీసులకు తెలంగాణకు చెందిన ఎస్పీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అయినా పోలీసులు మాత్రం ససేమిరా అన్నారు.

"

దీంతో కోపమొచ్చిన ఎస్పీ కార్యకర్తలు డౌన్ డౌన్ కేసిఆర్ అంటూ నినాదాలు అందుకున్నారు. ఉదయం నుంచి అఖిలేష్ కు స్వాగతం పలికేందుకు ఎండలో ఎదురుచూశామని కానీ పోలీసులు మాత్రం టిఆర్ఎస్ వాళ్లనే అనుమతించారని ఆరోపించారు. అయితే పోలీసులు వారిని చెదరగొట్టారు. తమ పార్టీ అధినేతకు స్వాగతం పలికే వెసులుబాటు కూడా ఇవ్వకుండా తెలంగాణ పోలీసులు పక్షపాతం చూపడం దారుణమని ఎస్పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అఖిలేష్ నోటీసుకు తీసుకుపోతామన్నారు. తెలంగాణ పోలీసులు ఎలా రెచ్చిపోయారో పైన వీడియోలో చూడండి.

loader