హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఈనెల 8న తమిళసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 8న ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర ఎస్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 


గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు రాష్ట్ర మంత్రులు, సీనియర్‌ అధికారులు పాల్గొననున్నారు. ఇకపోతే తెలంగాణ రాష్ట్రానికి రెండో గవర్నర్ గా, తొలి మహిళా గవర్నర్ గా రికార్డు సృష్టించబోతున్నారు సౌందర రాజన్.  

కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త గవర్నర్‌గా తమిళిసై సౌందర రాజన్‌ నియామకాన్ని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. 

అటు ప్రస్తుత గవర్నర్ నరసింహన్ ఈనెల 7న బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. మరోవైపు కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ ఈ నెల 11వ తేదీన హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. 

ఈ వార్తలు కూడా చదవండి

నరసింహన్ బదిలీ: తెలంగాణకు సౌందర రాజన్, హిమాచల్‌కు దత్తన్న

తెలంగాణ గవర్నర్ నరసింహాన్ బదిలీ?

సౌందర రాజన్ కు నియామకపత్రాలు అందజేత (వీడియో)