పెట్రోలు బంకులు నడిచొస్తాయి. మనింటికే వస్తాయి. మనకు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ అవసరమైతే ఇకనుంచి బంకు వద్దకు వెళ్లి కొట్టించుకోవాల్సిన పనిలేదు. పెట్రోలు బంకులే మనింటికి వస్తుంది. మనకు అవసరమైనంత పెట్రోల్, డీజిల్ పోసి వెళ్లిపోతుంది. సరికొత్త కార్యక్రమానికి పెట్రోల్ బంకులు శ్రీకారం చుట్టాయి.

దేశంలో పెట్రోలు వినియోగం రోజు రోజుకూ పెరిగిపోతున్నది. కొత్త వాహనాలు లెక్కకు మించి పెరిగిపోతున్నాయి. దీంతో ఎన్ని బంకులు నెలకొల్పినా సరిపోవడం లేదు. బంకుల వద్ద క్యూలైన్లు బారులు తీరుతున్నాయి. క్యూలో నిలబడి పెట్రోల్ కొట్టించుకోవడంతో వినియోగదారుల సమయం వృథా అవుతోంది.

అందుకే పెట్రోలు బంకులే మన ఇంటికి వచ్చి పెట్రోల్ పోసి వెళ్లడం మంచి పనే కదా. పెట్రోలుతోపాటు డీజిల్ కూడా డోర్ డెలివరీ చేస్తారు. ప్రస్తుతం బెంగుళూరులో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అక్కడ పెట్రోలు బంకులు ఇంటికొచ్చి పెట్రోలు సరఫరా చేసి వెళ్తున్నయి.

పెట్రోలు ట్యాంకర్ వచ్చి అవసరమైన చోట, అవసరమైన వారికి పెట్రోల్ సరఫరా చేస్తుంది. ఈ తరహా ప్రయోగం అతి కొద్ది రోజుల్లోనే దేశమంతా విస్తరించేందుకు పెట్రోల్ బంకుల యజమానులు, చమురు సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.

సో.. మొత్తానికి అతి కొద్ది రోజుల్లోనే మన ఇంటికి పెట్రోల్ బంకులు వచ్చి అవసరమైనంత పెట్రోల్ పోసి వెళ్లే కాలం రానున్నది. అయితే ఇది మెట్రో నగరాలకు పరిమితం చేసే అవకాశాలున్నాయి.

గ్రామీణ ప్రాంతాలు, చిన్న చిన్న పట్టణాల్లో ఈ తరహా సేవలు ఇప్పట్లో వచ్చే చాన్స్ లేదని బంకు ఓనర్లు అంటున్నారు.