క్షణిక సుఖం కోసం కొందరు వావి వరసలను మరిచిపోతున్నారు. అక్రమ బంధాలతో చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ప్రతిరోజూ ఎన్నో వార్తలు చూస్తున్నా ఆ కొందరిలో మార్పు రావడం లేదు.

తాజాగా అత్త వివాహేతర సంబంధం అల్లుడి ప్రాణాలను బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం తూటిపేట తండాకు చెందిన అంగోతు బాబుకు 8 నెలల క్రితం పెళ్లయ్యింది.

హైదరాబాద్‌లో క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. భార్య నిర్మలతో కలిసి మీర్‌పేట్ నందనవనం కాలనీలో నివసిస్తున్నాడు. కొంతకాలంగా భార్య తల్లి విజయ (40) శ్రీను అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో అతను ప్రతి రోజు తన ఇంటికి రావడం గమనించాడు. 

దీనిపై అత్తను నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు పెద్దల దగ్గర పంచాయితీ పెట్టించాడు. దీనిని ఓర్చుకోలేని అత్త విజయ, శ్రీనులు బాబుకు ఫోన్‌ చేసి బెదిరించారు.

దీంతో మనస్థాపానికి గురైన బాబు ఇంట్లో ఎవరులేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.