హైద్రాబాద్ గౌలిగూడ లో పేలుడు: ఒకరి మృతి, మరొకరికి గాయాలు
హైద్రాబాద్ నగరంలోని అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిగూడలో పేలుడు చోటు చేసుకొంది. కెమికల్ ను డ్రైనేజీలో వేసి నీళ్లు పోస్తున్న సమయంలో పేలుడు చోటు చేసుకొంది.ఈ పేలుడులో భరత్ చనిపోగా, వేణుగోపాల్ తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్: Hyderabad నగరంలోని Afzalgunj పోలీస్ స్టేషన్ పరిధిలోని Gowligudaలో బ్లాస్ట్ చోటు చేసుకొంది. కెమికల్ ను Drainageలో వేసి నీళ్లు పోస్తున్న సమయంలో Blast జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరొకరు గాయపడ్డారు. కెమికల్ ను డ్రైనేజీలో వేసి నీళ్లు పోస్తున్న సమయంలో పేలుడు చోటు చేసుకోవడంతో Bharat అక్కడికక్కడే మరణించాడు. ఈ ప్రమాదంలో భరత్ తండ్రి Venugopal తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. భరత్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వేణుగోపాాల్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
గిరిరాజ్ కంపెనీతో భరత్ chemical వ్యాపారం చేస్తున్నాడు. గడువు తీరిన కెమికల్ ను భరత్ తన ఇంటి ముందున్న డ్రైనేజీలో పారబోసేవాడు. ఇవాళ కూడా భరత్ మురుగు నీటిలో గడువు తీరిన కెమికల్స్ ను డ్రైనేజీలో పోశాడు. అయితే కొంత కెమికల్ బయటే ఉండిపోయింది. అయితే ఈ కెమికల్ ను డ్రైనేజీలో వేసేందుకు గాను ఆయన నీటిని పోశాడు. దీంతో పేలుడు చోటు చేసుకొంది. ఈ పేలుడు తీవ్రత ఎక్కువగా ఉంది. పేలుడుకు భరత్ రెండు అంతస్థుల వరకు ఎగిరి కిందపడి మరణించాడు. భరత్ తండ్రి వేణుగోపాల్ కకూడా తీవ్రంగా గాయపడ్డారు.