ఆస్తి కోసం కన్నతల్లినే అతి దారుణంగా కొట్టించంపాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణం ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.
కరీంనగర్ : నవమాసాలు కడుపున మోసి ప్రాణంపోసిన తల్లి ప్రాణాలు తీసాడు ఓ కసాయి కొడుకు. తల్లిపై ప్రేమ లేకున్నా వృద్దురాలన్న కనీస జాలి చూపించకుండా అందరూ చూస్తుండగానే కొట్టిచంపాడు దుర్మార్గుడు. మానవ సంబంధాలకే మచ్చలాంటి ఈ అమానుష ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన కనకవ్వ(60) ముగ్గురు కూతుర్ల, ఓ కొడుకు సంతానం. పిల్లలందరికీ పెళ్లిళ్లయి ఎవరి జీవితం వారు గడుపుతున్నారు. కొన్నేళ్ల క్రితమే భర్త చనిపోవడంతో వ్యవసాయ భూమి కనకవ్వ పేరిట వుంది. ఈ భూమి విషయంలోనే కొడుకు, కూతుళ్లకు మధ్య వివాదం సాగుతోంది. తల్లి కనకవ్వ కూడా కూతుళ్లకే మద్దతిస్తోందని కోపం పెంచుకున్న కొడుకు దారుణానికి ఒడిగట్టాడు.
వీడియో
భూమి విషయమై ఇవాళ మరోసారి కనకవ్వ పిల్లల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే తల్లి కూతుళ్లవైపు మాట్లాడుతోందని కోపంతో రగిలిపోయిన కొడుకు చేతిలోని పారతో దాడిచేసాడు. దీంతో తల పగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో కనకవ్వ అక్కడికక్కడే మృతిచెందింది.
Read More బాచుపల్లి రోడ్డులో గుంతలకు చిన్నారి బలి.. స్కూల్ బస్సు కిందపడి మృతి..
ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. కనకవ్వ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లిని చంపిన నిందితున్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
