ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు: స్టేషన్ ఘన్‌పూర్‌లో నిలిపివేత

ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలులో ఆదివారంనాడు  పొగలు వెలువడ్డాయి.  దీంతో రైలును  జనగామ రైల్వే స్టేషన్ లో  నిలిపివేశారు.

Some Detected in Intercity  Express Train lns

వరంగల్: ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలులో  ఆదివారంనాడు పొగలు వచ్చాయి.  దీంతో  స్టేషన్ ఘన్ పూర్ రైల్వే స్టేషన్ లో రైలును నిలిపివేశారు.2022 మే 30వ తేదీన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్  రైలులోని ఓ బోగీ  నుండి పొగ వెలువడింది. మహారాష్ట్రలోని షెలార్‌వాడీ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ఘటన  చోటు  చేసుకుంది. ఈ రైలులోని  నాలుగో కోచ్ నుండి పొగలు వెలువడినట్టుగా గుర్తించి  రైలును నిలిపివేశారు.  మరమ్మత్తుల తర్వాత రైలును  తిరిగి పంపించివేశారు. సికింద్రాబాద్ నుండి  గుంటూరు వైపు వెళ్తున్న ఇంటర్ సిటీ రైలులో  పొగలు వచ్చాయి.రైలులో  పొగలు రావడంతో  ప్రయాణీకులు  భయపడ్డారు. అయితే  ఎలాంటి ప్రమాదం లేదని  అధికారులు తేల్చడంతో ప్రయానీకులు ఊపిరి పీల్చుకున్నారు. 

2021  జూన్ 16న  ఇంటర్ సిటీ  ఎక్స్ ప్రెస్ రైలు నుండి పొగ వచ్చింది.  నాందేడ్- ఆదిలాబాద్   ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు  వ్యాపించాయి.  తలమడుగు మండలం డోర్లి గేటు వద్దకు రైలు రాగానే  రైలు ఇంజన్ లో పొగ వచ్చింది. వెంటనే  రైలును  లోకో పైలెట్ నిలిపివేశాడు.ఇవాళ  కూడ  ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలులో పొగ రావడంతో గుర్తించిన రైల్వే సిబ్బంది రైలును  స్టేషన్ ఘన్ పూర్ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. రైలు లైనర్లు జామ్ కావడంతో రైలు నుండి పొగలు వచ్చినట్టుగా గుర్తించారు.
.  మరమ్మత్తులు నిర్వహించిన తర్వాత రైలును  స్టేషన్ ఘన్ పూర్ నుండి పంపనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios