ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను కిరాయి హంతకులతో కిడ్నాప్ చేయించి.. హత్య చేయించిన వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసును మూడు నెల్లలో చేధించడమే కాకుండా.. నిందితుడికి శిక్షకూడా పడడం విశేషం.
అమీర్ పేట : Software engineer ను అపహరించి.. వికారాబాద్ అడవుల్లో murder చేసిన నిందితుడికి life imprisonment విధిస్తూ.. మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి తీర్పు ఇచ్చారు. ఎస్ ఆర్ నగర్ లో జరిగిన ఈ ఘటన వివరాలను ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు… బి.కె గూడాలోని వెంకటేశ్వర ఆలయం సమీపంలో ఉండే చంద్రశేఖర్ గౌడ్ (35) నిరుడు డిసెంబర్ 4న కనిపించకపోవడంతో రాములమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చంద్రశేఖర్ గౌడ్ మొదటిభార్య సోదరుడైన అరుణ్ కుమార్ గౌడ్ (35) ఇద్దరు కిరాయి హంతకులకు supari ఇవ్వడంతో... వారు అతడిని kidnap చేసి వికారాబాద్ అడవుల్లో హత్య చేశారు. హత్య చేసిన దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి.. ఫోటోలను అరుణ్ కుమార్ గౌడ్ కు పంపారు. నిందితుడు ఆ ఫోటోలను తన సోదరితో పాటు పాతబస్తీకి చెందిన ఇద్దరు సమీప బంధువులకు చేరవేశాడు. మెయిల్స్ ద్వారా పంపిన ఫోటోల వ్యవహారం బయటకు పొక్కి.. చివరకు పోలీసులకు చేరింది.
దర్యాప్తు ప్రారంభించిన అప్పటి ఇన్స్పెక్టర్ రమణ గౌడ్ నేతృత్వంలోని ఎస్సై సుదర్శన్రెడ్డి బృందం అరుణ్ కుమార్ గౌడ్ ను చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తగిన సాక్ష్యాధారాలతో చార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణ కొనసాగి, హత్య చేసిన నిందితుడు అరుణ్ కుమార్ గౌడ్ కు జీవిత ఖైదుతో పాటు రూ. 5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఇ. తిరుమలదేవి బుధవారం తీర్పు ఇచ్చారు.
ఇదిలా ఉండగా, నిన్న ఢిల్లీలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికలు, విదేశీయులు సహా 200 మందికి పైగా womenను బెదిరించి వారి nude photsను Porn websitesకు విక్రయించిన కీచకుడిని ఢిల్లీ పోలీసులు arrest చేశారు. అతడి లాప్టాప్ లో ఏకంగా నాలుగువేల నగ్న ఫోటోలు చూసి విస్తుపోయారు. మెకానికల్ ఇంజనీరింగ్, ఎంబీఏ చదివి.. ఓ అంతర్జాతీయ దిగ్గజ సంస్థలో ఉద్యోగం చేస్తున్న నిందితుడు మోహిత్ శర్మ (33) ఈ అక్రమ దందా సాగిస్తున్న తీరును ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ మహిళ తనను బెదిరించి, నగ్న చిత్రాలు తీసుకుందని 2020 సెప్టెంబర్, 2021 జూన్ లో డిల్లీ సైబర్ సెల్ పోలీసులకు ఆన్లైన్ ద్వారా రెండు ఫిర్యాదులు అందాయి. వాటిపై ఇంటిలిజెంట్ అండ్ ఆపరేషన్స్ విభాగం రంగంలోకి దిగింది. ఇంస్టాగ్రామ్ ఐడిని, దానిని సృష్టించేందుకు ఉపయోగించిన ఈమెయిల్ ఐడిని ట్రాక్ చేసింది. నోయిడాలోని ఓ ఇంటి నుంచే ఇదంతా జరిగిందని గుర్తించింది.
ఆ తర్వాత ఏసిపి రామన్ లాంబా, ఇన్ స్పెక్టర్ అరుణ్ త్యాగి బృందం ఆ ఇంటికి వెళ్లగా.. మోహిత్ శర్మ ఉన్నాడు. ఆ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తన వైఫై హ్యాక్ అయ్యిందని, ఇప్పటికే ఫిర్యాదు కూడా చేశానని.. అని మొదట బుకాయించ్చాడు. అయినా పోలీసుల బృందం అతని ఫోన్లు, ల్యాప్టాప్లు అన్నింటినీ పరిశీలించగా అతడి నిర్వాకం బయటపడింది.
