Asianet News TeluguAsianet News Telugu

ప్రేమించిన వ్యక్తి వేరే పెళ్లి చేసుకుంటున్నాడని.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య...

ప్రేమించిన యువకుడు వేరే యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడడంతో తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన ఆ యువతి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. 

software engineer committed suicide over lover getting marrying another woman in hyderabad - bsb
Author
First Published Sep 13, 2023, 11:43 AM IST

హైదరాబాద్ : హైదరాబాదులోని జగద్గిరిగుట్టలో ఓ యువతి  బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమించిన వ్యక్తి మరో యువతిని పెళ్లాడడానికి సిద్ధపడడంతో ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. సీఐ క్రాంతి కుమార్ ఈ ఘటనకు సంబంధించిన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…ఆత్మహత్యకు పాల్పడిన యువతి పేరు మౌనికగా గుర్తించారు.  మౌనిక స్వస్థలం మంచిర్యాల జిల్లా. ఆమె తల్లిదండ్రులు మంచిర్యాలలోని పద్మశాలి కాలనీలో నివసిస్తారు. తండ్రి రాజనర్సు కరెంటు పని చేస్తాడు.  తల్లి విజయలక్ష్మి అంగన్వాడి కార్యకర్త.

మౌనిక (23) ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ తరువాత హైదరాబాదులోని మాదాపూర్ లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఓ స్నేహితురాలితో కలిసి ఆస్పెస్టాస్ కాలనీ సమీపంలోని నెహ్రూ నగర్ లో గది అద్దెకు తీసుకొని ఉంటుంది. సాయికుమార్ అనే యువకుడితో మౌనిక కొంతకాలంగా ప్రేమలో పడింది. ఈ విషయం రెండు నెలల క్రితం తల్లిదండ్రులకు చెప్పింది. దీనికి మౌనిక తల్లిదండ్రులు అంగీకరించలేదు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి షాక్.. వైసీపీ గూటికే మేయర్ స్రవంతి దంపతులు.. సజ్జలతో చర్చలు!

మౌనిక ఇంట్లో ఒప్పుకోక పోవడంతో ఆ యువకుడు వేరే యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఈ విషయం తెలిసిన మౌనిక తీవ్రంగా మనస్థాపానికి గురైంది. రోజు రాత్రి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడే మౌనిక సోమవారం రాత్రి తల్లిదండ్రులు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వలేదు. మంగళవారం ఉదయం కూడా తల్లిదండ్రులు ఫోన్ చేశారు.  అప్పుడు కూడా మౌనిక ఫోన్ ఎత్తలేదు.

దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు మౌనిక స్నేహితురాలికి ఫోన్ చేశారు.  అయితే మౌనిక స్నేహితురాలు తాను గదిలో లేనని తన స్వగ్రామానికి వచ్చానని.. వారం రోజులుగా ఇక్కడే ఉంటున్నానని తెలిపింది. మౌనిక ఫోన్ ఎత్తడం లేదన్న విషయం తల్లిదండ్రులు చెప్పగానే.. తన స్నేహితుడిని గదికి పంపించి విషయం కనుక్కుంటానని చెప్పింది.

ఈ మేరకు స్నేహితుడిని గదికి పంపించేసరికి.. గది తలుపులు తెరుచుకునే ఉన్నాయి. లోపలికి వెళ్లి చూసేసరికి మౌనిక అపస్మారక స్థితిలో కనిపించింది. ఆమె శరీరం ఆకుపచ్చగా మారింది. చుట్టుపక్కల చూడగా పురుగుల మందు డబ్బా కనిపించింది. వెంటనే ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం తెలిపి, పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడి ఉంటుందని సమాచారం అందించారు.

అలాగే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మౌనికను పరీక్షించగా…అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. మౌనిక మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. మౌనిక ఆత్మహత్య మీద కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.  దీనిమీద దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios