హైదరాబాద్ నగరంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కన్నుమూసింది. గచ్చిబౌలిలో ఈ ప్రమాదం జరగగా.. ఆమె అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... సెలవు రోజుకావడంతో సాఫ్ట్‌వేర్‌ దంపతులు రమ్య, ప్రవీణ్‌కుమార్‌ ద్విచక్రవాహనంపై చిలుకూరి బాలాజీ ఆలయానికి బయలుదేరారు. అయితే గచ్చిబౌలిలోని విప్రో చౌరస్తా వద్ద ఓ లారీ వీరి వాహనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రమ్య అక్కడికక్కడే మృతి చెందగా.. ప్రవీణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు.