Asianet News TeluguAsianet News Telugu

గొంతు కోసి, చేతి మణికట్టు, కాలి నరాలు కట్ చేసి.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి దారుణ హత్య...

కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అత్యంత దారుణంగా గొంతు, నరాలు కోసి హత్య చేశారు. 

software employee murder in kothagudem
Author
First Published Dec 12, 2022, 8:06 AM IST

కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లాలో పాశవిక ఘటన చోటు చేసుకుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు ఓ వ్యక్తిని అతి దారుణంగా హతమార్చారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఈ పాశవిక హత్యా కాండ వెలుగులోకి వచ్చింది. ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి అడుగుతున్నాడనే కక్షతో అత్యంత దారుణంగా గొంతు, నరాలు కోసి చంపేశారు. ముత్యాలంపాడు క్రాస్ రోడ్ పంచాయతీలోని శాంతి నగర్ కు చెందిన బిజెపి మండల అధ్యక్షుడు ధరావత్ బాలాజీ పెద్ద కుమారుడు ధారావత్ అశోక్ కుమార్ (24). అతను  ఖమ్మంలోని ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

అతనికి పెళ్లి అయ్యింది.  భార్య అమల, రెండు నెలల చిన్నారి ఉన్నారు. కాగా, ముత్యాలపాడు క్రాస్ రోడ్ లో ఉండే  గూగులోత్ ప్రేమ్ కుమార్.. అశోక్ కుమార్ కు పరిచయం. అవసరమైనప్పుడల్లా అశోక్ కుమార్ దగ్గర.. ప్రేమ్ కుమార్ అప్పు తీసుకుంటుండేవాడు. ప్రేమ్ కుమార్ అలా ఇప్పటి వరకు అశోక్ కుమార్ దగ్గర రూ.80వేల వరకు అప్పు తీసుకున్నట్లు తెలిసింది. అంతేకాదు అతని మధ్యవర్తిత్వంతో మరో వ్యక్తికి కూడా  అప్పు ఇప్పించాడు. అయితే డబ్బులు తీసుకుని చాలా రోజులైంది. తిరిగి ఇవ్వకపోవడంతో అశోక్ కుమార్ వారిద్దరిని డబ్బులు ఇవ్వమని తరచుగా అడుగుతున్నాడు. దీంతో ఇద్దరూ అశోక్ కుమార్ మీద కక్ష పెంచుకున్నారు. 

క్యాబ్ లో ప్రయాణిస్తున్న మహిళకు, డ్రైవర్, ప్రయాణికుల వేధింపులు.. పదినెలల చిన్నారిని తోసేసి, హత్య...

ఈ క్రమంలో శనివారం రాత్రి డబ్బులు ఇస్తామని చెప్పి అశోక్ కుమార్ ను..  ప్రేమ్ కుమార్ తన టూ వీలర్ పై ముత్యాలంపాడు క్రాస్ రోడ్డుకు తీసుకువెళ్ళాడు. అక్కడ అశోక్ కుమార్ అప్పిచ్చిన ఇంకొక నిందితుడు ఉన్నాడు. వీరిద్దరూ కలిసి అశోక్ కుమార్ దగ్గరలోని పంచాయతీ కార్యాలయంలోకి బలవంతంగా లాక్కెళ్లారు. లాక్కెళ్లి అక్కడ అతని గొంతు, చేతి మణికట్లు, కాలి చీలమండల నరాలు కోసి పాశవికంగా  హత్య చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. కాగా, రాత్రి వెళ్లిన అశోక్ కుమార్ తెల్లారిన ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అటువైపు పంచాయతీ కార్యాలయంలో అతని మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఇల్లెందు డీఎస్పీ రమణమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. దీనిపై టేకులపల్లి సీఐ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమ్ కుమార్ ని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. మరోవైపు అశోక్ కుమార్ హత్యకు కారకులైన వారిమీద కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు ఆందోళనకు దిగారు. ప్రేమ్ కుమార్ ఇంటిమీద దాడి చేశారు. పోలీసులు కలగజేసుకుని వారిని శాంతింపజేశారు. అయితే హత్యకు పాల్పడింది. గంజాయి బ్యాచ్ అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్తగూడెం, ఖమ్మంలకు చెందినవారితోనే హత్య చేయించి ఉండొచ్చని.. పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios