Asianet News TeluguAsianet News Telugu

కాల్ గర్ల్ కోసం పాకులాడి.. సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి..

ఎస్కార్ట్ సర్వీస్ కోసం వెతికిన ఓ ఐటీ ఉద్యోగి అడ్డంగా బుక్కయ్యాడు. చివరికి దాదాపు రెండు లక్షలు పోగొట్టుకుంటే కానీ మోసపోయిన విషయం అర్థం కాలేదు. 

Software employee loses rs. 1.97 lakhs in cyber criminals, hyderabad
Author
First Published Jan 5, 2023, 10:06 AM IST

హైదరాబాద్ : చేతిలో సెల్ ఫోన్.. అందులో ఇంటర్నెట్.. ఇంకేముంది ఏది కావాలన్నా క్షణాల్లో వెతకొచ్చు.. అసాంఘిక కార్యకలాపాలు.. చీకటి వ్యవహారాలూ గుట్టు చప్పుడు కాకుండా చేయచ్చు. అలాగే... చేశాడో సాఫ్ట్ వేర్ ఉద్యోగి..ఇయర్ ఎండింగ్ లో ఎంజాయ్ చేద్దామనుకున్నాడు. దీనికోసం ఆన్ లైన్ లో ప్రాస్టిట్యూట్ కోసం వెతికాడు. గుట్టు చప్పుడు కాకుండా పనికానిచ్చేద్దాం అనుకున్నాడు. కానీ.. చివరికి, ఇలాంటి వారికోసమే వలవేసి.. కాపు కాసే సైబర్ నేరస్తుల బారిన పడి 1.97లక్షలు పోగొట్టుకున్నాడు.

వివరాల్లోకి వెడితే.. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి చందానగర్ లో ఉంటాడు. డిసెంబర్ లాస్ట్ వీక్ లో ఎస్కార్ట్ సర్వీస్ కోసం ఆన్ లైన్ లో వెతికాడు. కాల్ గర్ల్ కోసం వాడే ఈ సర్వీసు కోసం వెతుకులాటలో ఓ వెబ్ సైట్లో ఓ లింకు కనిపించింది. వెంటనే క్లిక్ చేశాడు. అందులో ఓ వాట్సాప్ నెంబర్ దొరికింది. వెంటనే కాంటాక్ట్ అయ్యాడు.

దారుణం.. ఉద్యోగం కోసం భర్తను చంపిన భార్య...

ఓ వ్యక్తి లైన్లోకి వచ్చారు. తన పేరు పటేల్ చార్మి అని పరిచయం చేసకున్నారు. అతనికి కాల్ గర్ల్ సర్వీసులు కావాలంటే.. బుకింగ్ కోసం రూ.510 కట్టాలని చెప్పారు.. ఆ తరువాత రూ.5,500 కట్టించుకున్నారు. ఆ తరువాత సెక్యూరిటీ డిపాజిట్ అంటూ రూ.7,800 కట్టించుకున్నారు... అంతటితో ఆగలేదు.. అలా వేర్వేరు కారణాలతో.. విడతవారీగా రూ.1.97 లక్షలు వసూలు చేశారు. అప్పటికి గానీ ఐటీ ఉద్యోగికి ఐస్ ఓపెన్ కాలేదు. వెంటనే మోసపోయినట్లు గుర్తించి.. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

ఇదిలా ఉండగా, మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే అక్టోబర్ లో వెలుగు చూసింది.  అతనికి పెళ్లయ్యింది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కానీ అతడికి డేటింగ్ పురుగు కుట్టింది. దీంతో ఓ ఆన్ లైన్ డేటింగ్ వెబ్ సైట్ లో మ్యాచ్ కోసం వెతకడం మొదలు పెట్టాడు. ఇంకేముంది అసలే ఎవరు దొరుకుతారా అని చూసే సైబర్ నేరగాళ్లకు మనోడు.. పోయి పోయి.. చిక్కుకుపోయాడు. విడతల వారీగా మొత్తం రూ. 6.3 లక్షలు పోగొట్టుకున్నాక గానీ ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు అసలు విషయం బోధపడలేదు. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెడితే.. 

మహారాష్ట్రలోని థానేకు చెందిన 48 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆన్‌లైన్ డేటింగ్ వెబ్‌సైట్‌లో మ్యాచ్ కోసం వెతికాడు. అలా సైబర్ మోసగాళ్ల బారిన పడి రూ. 6.3 లక్షలు పోగొట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. మామూలుగా అందరికీ వచ్చినట్లే ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌కు కూడా ఆన్‌లైన్ డేటింగ్ సేవల గురించి చెబుతూ.. ఓ తెలియని నంబర్ నుండి మెసేజ్ వచ్చింది. దీంతో అతడిలో ఏదో ఆశ మొలకెత్తింది. అంతే, అందులో ఇచ్చిన నెంబర్ కు కాల్ చేశాడు. అవతలి వ్యక్తి డేటింగ్ సైట్ లో చేరాలంటే ఎంట్రీ ఫీజుగా రూ.38,200 చెల్లించాలని చెప్పాడు.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అలాగే చేశాడు. కానీ అవతలి వ్యక్తి అతడిని ఆ సైట్లో రిజిస్టర్ చేయలేదు. దీంతో, ఏదో అనుమానం వచ్చి.. తాను కాల్ చేసిన వ్యక్తి మోసగాడేమోనని.. తన డబ్బు తనకు వాపస్ ఇవ్వమని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మళ్లీ కాల్ చేశాడు. అయితే నిందితుడు మాత్రం.. చక్కగా మాట్లాడుతూ అతడిని మళ్లీ బుట్టలో వేసుకున్నాడు. ఆ డబ్బులు సరిపోవని మరిన్ని కావాలన్నాడు. మొత్తంగా రూ.6.3 లక్షలు కట్టించుకున్నాడు. 

ఆ తరువాత విషయం అర్థమైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు సదరు సైబర్ క్రైం నిందితుడి మీద కేసు నమోదు చేశారు. ఈ మేరకు సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సులభా పాటిల్ తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios