చైతన్యపురిలో దారుణం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న దంపతులపై పోకిరీలు వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
చైతన్యపురిలో దారుణం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న దంపతులపై పోకిరీలు వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. బాధిత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దంపతులు చైతన్యపురిలో నివాసం ఉంటున్నారు. గత రాత్రిపూట బయటకు వెళ్లివస్తున్న వారిని కొందరు పోకిరీలు అడ్డుకున్నారు. అడ్డుకోవడమే కాకుండా వారిపై వేధించారు. రాడ్లు, బాటిళ్లతో దాడి చేశారు. దంపతుల కారు అద్దాలు కూడా ధ్వంసం చేశారు.
ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాధిత సాఫ్ట్‌వేర్ దంపతులు చైతన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చైతన్యపురి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోకిరీలు మద్యం మత్తులో ఈ దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
