వనపర్తి ఎమ్మెల్యే, మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి నోట పరుషమైన పదాలు వచ్చాయి. ఆయన తన సొంత నియోజకవర్గం వనపర్తిలో జరిపిన సింహగర్జన సభలో తెలంగాణ సిఎం కేసిఆర్ మీద, మంత్రి హరీష్ రావు మీద తీవ్రమైన కామెంట్ చేశారు. తెలంగాణలో టిడిపిని నాశనం చేసిందే వీరిద్దరూ అని విమర్శించడంతోపాటు మరో వివాదాస్పద కామెంట్ కూడా చేశారు. ఇక రేవంత్ రెడ్డి ఇప్పుడు టిడిపిని వీడి కాంగ్రెస్ లో చేరడంతో రైట్ పార్టీలో రైట్ లీడర్ అయ్యారని చిన్నారెడ్డి కామెంట్ చేశారు. వనపర్తి సభలో చిన్నారెడ్డి నోట వచ్చిన ఆ తీవ్రమైన కామెంట్స్ ఈ కింది వీడియోలో ఉన్నాయి చూడండి.