Asianet News TeluguAsianet News Telugu

కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో పొగలు.. తప్పిన పెను ప్రమాదం..

డోర్నకల్ లో పెద్ద రైలు ప్రమాదం తృటిలో తప్పింది. ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్తున్న  కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో పొగలు వచ్చాయి. వెంటనే గమనించి, డోర్నకల్ లో రైలు ఆపి.. ప్రయాణికులను షిప్ట్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. 

Smoke on Konark Express in Dornakal
Author
Hyderabad, First Published Jun 27, 2022, 10:47 AM IST

డోర్నకల్ :  ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్తున్న  కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. కోణార్క్ ఎక్స్ప్రెస్ లోని ఏసీ బోగీల్లో పొగలు రావడంతో డోర్నకల్ జంక్షన్ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే డోర్నకల్ జంక్షన్ రైల్వే స్టేషన్కు చేరుకుని చర్యలు చేపట్టారు. పొగలు వ్యాపించిన భోగిని వేరుచేసి ప్రయాణికులను  మరో బోగీలో కి తరలించారు. ఈ ఘటనతో   ముందే అప్రమత్తం అవడం వల్ల ప్రయాణికులు ఎవరూ ఇబ్బంది పడలేదని అందరు సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు వెల్లడించారు ఏసీ బోగీల్లో పొగలు రావడానికి గల  కారణాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. సాంకేతిక కారణాల వల్ల జరిగిందా?  లేక ఇతర కారణాల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలు పెట్టెలో మృతదేహం లభ్యమయ్యింది. ఆదివారం రోజు ఉదయం శ్రీకాకుళం నుంచి తిరుపతికి చేరిన రైలులోని బోగీలో ఈ మృతదేహాన్ని గుర్తించారు.  తిరుపతి రైల్వే స్టేషన్ అధికారుల ఫిర్యాదుతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి వయసు 45-50 సంవత్సరాలుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. 

జడ్చర్ల సమీపంలో ఆర్టీసీ బస్సు దగ్దం.. కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం..

మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకున్నారు. మృతుడు నలుపు రంగు టీ షర్టు, బ్రౌన్ కలర్ ప్యాంటు వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న సాధారణ బోగీని శుబ్రం చేయడానికి వెళ్లిన పారిశుద్ధ్య కార్మికులు ఈ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.  మృతదేహాన్ని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు.

కాగా, ఫిబ్రవరి 14న  సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలులో యశ్వంతపూర్ నుంచి హజరత్.నిజాముద్దీన్ వెళ్తుండగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ లో దారుణం జరిగింది. ఓ యువతిని సాయం పేరిట మభ్యపెట్టిన కిరాతకుడు రైలులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు యువతి రైలు ఎక్కిన తర్వాత ఆమెకు కూర్చునేందుకు చోటు దొరకలేదు. దీంతో వంట చేసే భోగిలో ఖాళీ ఉందని అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు అంటూ ఓ వ్యక్తి ఆమెను నమ్మించి అక్కడికి తీసుకెళ్లాడు.  

అక్కడ ఆమె నిద్రించే సమయంలో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. వంట చేసే భోగి వద్దకు వెళ్లగా అందులో ఉన్న వారు వెంటనే తలుపు తెరవలేదు. పోలీసుల ఒత్తిడితో అరగంట తర్వాత తెరిచారు. అక్కడ అపస్మారకస్థితిలో పడివున్న బాధితురాలిని పోలీసులు రక్షించి.. ఆస్పత్రికి తరలించారు.  ఆస్పత్రిలో చికిత్స అనంతరం జరిగిన విషయాన్ని ఆమె పోలీసులకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 15 మంది అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలు నిందితుడిని గుర్తించేందుకు విచారణ కొనసాగిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios