భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో మనిషి పుర్రె, ఎముకలు, పళ్లు, కళ్లు ఓ గదిలో మూటకట్టి కనిపించడం కలకలం రేపింది. దుర్వాసన వస్తుండడంతో వెతికిన సిబ్బందికి ఈ మూట కనిపించడంతో షాక్ కు గురయ్యారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో మనిషి పుర్రె, ఎముకలు, పళ్లు, కళ్లు ఓ గదిలో మూటకట్టి కనిపించడం కలకలం రేపింది. దుర్వాసన వస్తుండడంతో వెతికిన సిబ్బందికి ఈ మూట కనిపించడంతో షాక్ కు గురయ్యారు.
ఆస్పత్రి వర్గాల కథనం ప్రకారం.. పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో దుర్వాసన వస్తుండటంతో సిబ్బంది పరిశీలించారు. ఆ వాసన జనరేటర్ ఉండే ఎలక్ట్రికల్ గది నుంచి వస్తున్నట్లు గుర్తించారు. ఆ రూంలో మూలకు నీలం రంగు లుంగీ మూట కనిపించింది. శానిటేషన్ సూపర్‌వైజర్ దుర్గా, వార్డు బాయ్ ఎన్‌సీపీ.బాబు దాన్ని విప్పి పరిశీలించగా.. అందులో ఓ బాక్స్ ఉంది.
తెరిచి చూస్తే ప్లాస్టిక్ డబ్బా, ప్లాస్టిక్ కవర్ కనిపించాయి. ప్లాస్టిక్ డబ్బాలో మనిషి మొండెం నుంచి వేరు చేసిన పుర్రె, చేతి ఎముక ఉన్నాయి. కవర్‌లో కళ్లు, పళ్లు ఉన్నాయి. ఇవి నాలుగైదు రోజుల క్రితం మృతి చెందిన శవం అవశేషాలుగా సిబ్బంది భావిస్తున్నారు. ఈ అవశేషాల మూటను మార్చురీ గదికి తరలించారు.
పోలీసులు ఆస్పత్రి సిబ్బంది సహకారంతో సీసీ పుటేజీలో నాలుగైదు రోజులుగా ఆస్పత్రికి వచ్చిపోయిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే, ఈ ఘటనపై సిబ్బంది మాట్లాడుతూ వాటిని పోస్ట్‌మార్టం కోసం తెచ్చామని చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. పోస్ట్‌మార్టం సిబ్బంది మాత్రం అటువంటిదేమీ లేదని పై అధికారులకు తెలిపినట్లు సమాచారం.
సూపరింటెండెంట్ ముక్కంటేశ్వరరావును వివరణ కోరగా.. తాను మీటింగ్ ఉండటం వల్ల ఆస్పత్రిలో లేనని, వివరాలు తెలుసుకుంటానని పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని సిబ్బంది పరిశీలించారని, ఫిర్యాదు ఇస్తే దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ ప్రవీణ్ తెలిపారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 5, 2021, 9:16 AM IST