హైదరాబాద్:వాలంటైన్స్ డే సందర్భంగా కండ్లకోయ ఆక్సిజన్ పార్క్‌లో  ఓ జంటకు బలవంతంగా పెళ్లి చేసిన కేసులో  ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై  యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వాలంటైన్స్ డే  సందర్భంగా కండ్లకోయ ఆక్సిజన్ పార్క్‌లో  తిరుగుతున్న  ఇద్దరు కాలేజీ విద్యార్థులకు భజరంగ్ దళ్ కార్యకర్తలు బలవంతంగా పెళ్లి చేశారు.  ఈ పెళ్లిని వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

బలవంతంగా పెళ్లి చేసిన శ్రీహరిచారి,ఆనంద్, అవినాష్, ఆశోక్, సురేష్ కుమార్, చంద్రశేఖర్‌లను  పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతపు పెళ్లి ఘటనలో  బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఆరుగురిని అరెస్ట్ చేసినట్టుగా  బాలానగర్ డీసీపీ పద్మజ తెలిపారు. 

తన కూతురు  కాలేజీకి వెళ్లిన సమయంలో  దూరపు బంధువు రాకేష్ అక్కడికి రావడంతో  ఇద్దరు కలిసి పార్క్‌కు వెళ్లగా బలవంతంగా పెళ్లి చేశారని బాలిక తండ్రి పోలీసులకు వివరించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు డీసీపీ పద్మజ చెప్పారు.

సంబంధిత వార్తలు

ప్రేమ జంటల వేటలో భజరంగ్ దళ్: మేడ్చల్‌లో ఓ జంటకు పెళ్లి (వీడియో)