మేడ్చల్: మేడ్చల్‌లోని ఓ ప్రేమ జంటకు గురువారం నాడు భజరంగ్ దళ్ కార్యకర్తలు పెళ్లి చేశారు. ఈ జంటకు పెళ్లి చేసిన వీడియోను భజరంగ్ దళ్ కార్యకర్తలు వీడియో తీశారు.

మేడ్చల్‌లోని సీఎంఆర్ కాలేజీ ఎదుట ఉన్న కండ్లకోయ ఆక్సిజన్ పార్క్‌లో ప్రేమ జంట ఉంది. ఈ ప్రేమ జంటను గుర్తించిన భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆ ప్రేమ జంటకు పెళ్లి చేశారు.వాలంటైన్స్ డే రోజు ప్రేమికులు  కన్పిస్తే పెళ్లిళ్లు చేస్తామని భజరంగ్ దళ్ కార్యకర్తలు ఇదివరకే హెచ్చరించారు.

ఇందులో భాగంగానే  కండ్లకోయ ఆక్సిజన్ పార్క్‌లో ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటకు భజరంగ్ దళ్ కార్యకర్తలు  పెళ్లి చేశారు.ఈ పెళ్లి చేసిన భజరంగ్ దళ్ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్య లు చేపట్టారు.

"