హైదరాబాద్: తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆరుగురు ఇంటలిజెన్స్ అధికారులు దొరికినట్లు ఎన్నికల అధికారి రజత్ కుమార్ చెప్పారు. ఎపి ఇంటలిజెన్స్ అధికారులపై విచారణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

సర్వేల పేరుతో ఎపి ఇంటలిజెన్స్ అధికారులు తెలంగాణలో సంచరిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత కేటీ రామారావు ఆరోపించిన నేపథ్యంలో రజత్ కుమార్ ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

ప్రతిపక్షాల ఫోన్ ట్యాపింగ్ పై తమకు ఫిర్యాదులు అందాయని, డీజీపిని తాము వివరణ కోరామని, డీజీపి నుంచి సమాధానం రావాల్సి ఉందని ఆయన శనివారం మీడియా సమావేశంలో చెప్పారు. 

ఇప్పటి వరకు 31.41 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్లు రజత్ కుమార్ చెప్పారు. ఇందులో 25.83 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, మిగతా 5.58 కోట్ల రూపాయలను ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారని ఆయన వివరించారు. మొత్తం 7,411 ఆయుధాలను సీజ్ చేసినట్లు తెలిపారు. 

సంబంధిత వార్త

ఏపి ఇంటలిజెన్స్ తో తెలంగాణలో చంద్రబాబు కుట్రలు...సాక్ష్యాలివే...: కేటీఆర్