హైదరాబాద్:  సినీ నటుడు శివాజీ తాజాగా మేఘా సంస్థపై చేసిన ఆరోపణలపై వైసీపీ  నేతలు విమర్శలు గుప్పిస్తోంది. ఎన్నికలకు ముందు శివాజీ తెర మీదికి తెచ్చిన నాటకాలనే మరోసారి తీసుకు వస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.

పోలవరం ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చిన మేఘా కంపెనీపై సినీ నటుడు శివాజీ ముందుకు వచ్చాడని  వైఎస్ఆర్‌సీపీ నేతలు విమర్శిస్తున్నారు. మేఘాపై బురదచల్లేందుకు శివాజీ కొత్త నాటకం ప్రారంభించాడని  ఆ పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.ఈ ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర ఉందనే అభిప్రాయంతో వైసీపీ వర్గాలు ఉన్నాయి.

పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టుకు రివర్స్ టెండర్లను పిలిచింది. రివర్స్ టెండర్లలో  మేఘా సంస్థ  ప్రభుత్వానికి రూ. 720 కోట్లు మిగిలే విధంగా బిడ్డు దాఖలు చేసింది. ఈ పరిణామం చంద్రబాబుకు మింగుడు పడలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

 ఈ కారణంగానే  ఎలక్ట్రిక్ బస్సుల వ్యవహరాన్ని ఇందులోకి లాగినట్టుగా వైసీపీ నేతలు టీడీపీపై మండిపడుతున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు వ్యవహరంలో మేఘా సంస్థకు రంగును పులిమేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ నేతలు టీడీపీపై ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే సినీ నటుడు శివాజీ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసినట్టుగా వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో ప్రజా ధనాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు తమ పార్టీ తీసుకొన్న నిర్ణయాలు టీడీపీకి నష్టం చేస్తున్న కారణంగానే  శివాజీతో తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో శివాజీ బీజేపీపై  చేసిన ఆరోపణలను వైసీపీ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అదే తరహలోనే ప్రస్తుతం తమ పార్టీపై శివాజీ కొత్త తరహాలో తప్పుడు ప్రచారానికి దిగుతున్నాడని వైసీపీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు. ఈ క్రమంలోనే మేఘా సంస్థపై విమర్శలకు దిగినట్టుగాత వైసీపీ నాయకత్వం అభిప్రాయంతో ఉంది.