రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం దక్కాలి: ఢిల్లీ దీక్షలో కవిత

మహిళా  రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని  కోరుతూ  కవిత  నేతృత్వంలో  ఇవాళ న్యూఢిల్లీలో  దీక్ష జరిగింది.  ఈ దీక్షలో  పలు పార్టీల  ప్రతినిధులు పాల్గొన్నారు.  
 

BRS MLC Kavitha Demands To Approve Women's Reservation bill in Parliament

న్యూఢిల్లీ:మహిళా రిజర్వేషన్ సాధించే వరకు తమ పోరాటం  ఆగదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  ప్రకటించారు.  శుక్రవారంనాడు  న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద  భారత జాగృతి ఆథ్వర్యంలో  కవిత  దీక్షను చేపట్టారు.  మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదించాలని  దీక్షను  నిర్వహించారు. ఈ దీక్ష సందర్భంగా  ఆమె  ప్రసంగించారు.  అంతకుముందు  పలువురు మహిళా నేతలకు  పూలమాలలు వేసి  కవిత నివాళులర్పించారు.  సీపీఎం  జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం  ఏచూరి ఈ దీక్షను  ప్రారంభించారు. అనంతరం  కవిత ప్రసంగించారు. 

భారత సంస్కృతిలో  మహిళకు పెద్దపీట వేశారని  ఆమె గుర్తు  చేశారు.  మహిళలను  గౌరవించడం  మన సంప్రదాయమని ఆమె చెప్పారు. అమ్మా నాన్న అని మనం పిలుస్తామన్నారు.  అమ్మా అనే శబ్దమే  ముందుంటుందని ఆమె  గుర్తు  చేశారు.రాజకీయాల్లోనూ  మహిళలకు  సముచిత  స్థానం దక్కాల్సిన  అవసరం ఉందని  కవిత  కోరారు.

మహిళా  రిజర్వేషన్  బిల్లు  చాలాకాలంగా  పెండింగ్ లో  ఉందని ఆమె గుర్తు  చేశారు. 1996 లో అప్పటి ప్రధాని దేవేగౌడ హయంలో  మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టినా  ఇంకా చట్టం కాలేదన్నారు.  దీక్షకు  మద్దతు  తెలుపుతున్న అందరికీ  ధన్యవాదాలు తెలిపారు  కవిత. మహిళా రిజర్వేషన్  సాధించే వరకు  తాము  పోరాటాన్ని విరమించేది లేదని  కవిత  స్పష్టం  చేశారు. బీజేపీకి  సంపూర్ణ మెజారిటీ  ఉందన్నారు.  బీజేపీ బిల్లు పెడితే  అన్ని పార్టీలు మద్దతు తెలుపుతాయని ఆమె  చెప్పారు. ఆకాశంలో సగం  అవకాశాల్లో సగం  ఇవ్వాలని ఆమె డిమాండ్  చేశారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios