డ్రగ్ కేసులో నిజా నిజాలు తేల్చేందుకు ఏర్పాటైన సిట్ దృష్టి ఇప్పుడు బ్యాంకాక్ బీచ్ పైకి మళ్లింది. డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో సిట్ అధికారులు కీలక సమాచారం సేకరించేపనిలో పడ్డారు. దీనిలోభాగంగానే బ్యాంకాక్ బీచ్ లో ఏంజరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. పూరి జగన్నాథ్ ఎక్కువ సినిమాలు బ్యాంకాక్ లోనే తీస్తుంటారు. ఆయన అక్కడ ఎక్కువ రోజులు బస చేస్తారు. దీంతో గంటల తరబడి బ్యంకాక్ బీచ్ లో షూటింగ్ జరిపిన పరిస్థితులు ఉన్నాయి.

పూరి విచారణ సందర్భంగా బ్యాంకాక్ బీచ్ ల ప్రస్తావన కూడా వచ్చినట్లు తెలిసింది. పూరికి బ్యంకాక్ బీచ్ లో ఎవరైనా డ్రగ్స్ సరఫరా చేశారా? అసలు బ్యాంకాక్ బీచ్ కు పూరి డ్రగ్ వ్యవహారానికి ఏమిటి సంబంధం అనే కోణంలో సిట్ విచారణ చేపట్టనుంది.

దీంతోపాటు బ్యంకాక్ పబ్స్ లో ఎక్కడ డ్రగ్స్ అమ్మతారు? పూరి ఏ పబ్ లో గడిపాడు అన్న కోణంలోనూ ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి సిసి పుటేజ్, ఇతర వీడియో ఆధారాలు సేకరించేపనిలో పడ్డారు సిట్ అధికారులు. ఈ ఆధారాలు దొరికితే పూరి డ్రగ్ కేసులో మరింత కూరుకుపోయే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైద్యుల పరీక్షల్లో పూరి డ్రగ్ తీసుకున్నట్లు తేలిందన్న వార్తలొస్తున్నాయి. దీంతోపాటు బ్యాంకాక్ బీచ్ గుట్టు రట్టు చేసిన తర్వాత కేసులో మరింత పురోగతి సాధించే అవకాశాలున్నట్లు ఎక్సైజ్ పోలీసులు చెబుతున్నారు.