Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: ఆ ముగ్గురి విషయంలో న్యాయ సలహా తీసుకుంటున్న సిట్

ఎమ్మెల్యేల ప్రలోభాల  కేసులో  విచారణకు  హాజరు కాని ముగ్గురి  విషయంలో  ఏం  చేయాలనే దానిపై  సిట్  బృందం  న్యాయ సలహ తీసుకుంటుంది.బీఎల్  సంతోష్, తుషార్,  జగ్గుస్వామిలు  ఇవాళ  సిట్  విచారణకు రావాల్సి  ఉంది.  కానీ  వారు  విచారణకు  హాజరు కాలేదు. 

 SIT  plans to   Legal  Opinion  on  Three  persons  not  attend  to  Probe
Author
First Published Nov 21, 2022, 8:59 PM IST

హైదరాబాద్:ఎమ్మెల్యేల  ప్రలోభాల  కేసులో  విచారణకు  హాజరుకాని  బీఎల్ సంతోష్,  తుషార్, జగ్గుస్వామిల  విషయంలో ఏం  చేయాలనే దానిపై సిట్  న్యాయ సలహ  తీసుకొంటుంది.  సోమవారంనాడు అడ్వకేట్  శ్రీనివాస్  విచారణకు  హాజరయ్యారు. సుమారు  ఏడు గంటలకు పైగా  శ్రీనివాస్ ను  సిట్  బృందం  విచారించింది.

బీజేపీ సంస్థాగత వ్యవహరాల  ఇంచార్జీగా  ఉన్న  బీఎల్  సంతోష్ కి  సిట్  బృందం  నోటీసు  పంపింది. అయితే  సంతోష్ కి  నోటీసు అందిందా  లేదా  అనే  విషయమై  స్పష్టత  రాలేదు. బీజేపీ  నేత  తుషార్,  జగ్గుస్వామిలకు  కూడా  ఈడీ నోటీసులు  జారీ  చేసింది.  అయితే  ఈ ముగ్గురు  కూడా  ఇవాళ  విచారణకు  రాలేదు.  అయితే విచారణకు  రాని ముగ్గురి విషయంలో  ఏం  చేయాలనేదానిపై   సిట్  బృందం  న్యాయ సలహా  తీసుకుంటుంది.  

గత  వారంలో  కేరళ  రాష్ట్రంలో  సిట్   బృందం  సోదాలు  నిర్వహించింది.  ఈ  సోదాల  సమయంలో కొంత  కీలక  సమాచారాన్ని  సిట్  సేకరించింది. సిట్  బృందం  సోదాలు  చేస్తున్న విషయాన్ని  తెలుసుకున్న  జగ్గుస్వామి  పరారీలో  ఉన్నారు. మరోవైపు  తుషార్ , రామచంద్రభారతిలకు  జగ్గుస్వామి  మధ్యవర్తిగా  ఉన్నట్టుగా  సిట్  అనుమానిస్తుంది. తుషార్,  జగ్గుస్వామిలకు  నోటీసులు పంపింది. అయితే  వీరిద్దరూ  కూడా  సిట్  విచారణకు  రాలేదు. దీంతో  ఈ  విషయమై  న్యాయపరంగా  ఏం  చేయాలనే దానిపై  సిట్  బృందం  న్యాయ నిపుణుల  సలహలు తీసుకొంటుంది.

రేపు  కూడా  అడ్వకేట్  శ్రీనివాస్  విచారణ

అడ్వకేట్  శ్రీనివాస్ ను  రేపు  కూడ సిట్  బృందం  విచారించే  అవకాశం  ఉంది.  ఇవాళ  సుమారు  ఏడు గంటలకు పైగా  శ్రీనివాస్ ను సిట్  విచారించింది. సింహయాజీకి  విమాన  టికెట్ల  కొనుగోలుపై  సిట్  బృందం  శ్రీనివాస్ ను  ప్రశ్నించింది.  అయితే  తాను పూజలు  చేయించుకొనేందుకే  సింహయాజీకి విమాన  టికెట్లు కొనుగోలు  చేసినట్టుగా  శ్రీనివాస్  సిట్  బృందానికి  చెప్పారని  తెలుస్తుంది.నందకుమార్ తో  శ్రీనివాస్  ఫోన్ లో  మాట్లాడిన డేటా ఆధారంగా  కూడ  పసిట్  శ్రీనివాస్ ను ప్రశ్నించారని  సమాచారం.  రేపు  కూడా శ్రీనివాస్ ను  సిట్  విచారించనుంది. ఈ  విచారణ  తర్వాత  మరికొందరికి  కూడా సిట్  నోటీసులు జారీ చేసే అవకాశం  లేకపోలేదు.

also  read:టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు: శ్రీనివాస్ ను విచారిస్తున్న సిట్ బృందం

గత  నెల  26న  మొయినాబాద్  ఫాం హౌస్  లో  రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లు   ఎమ్మెల్యేలను  ప్రలోభాలకు  గురి చేస్తున్నారని  పోలీసులు  అరెస్ట్  చేశారు. తాండూరు  ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్  రెడ్డి  ఫిర్యాదు  మేరకు  పోలీసులు ఈ   ముగ్గురిని  అరెస్ట్  చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios