కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో 25 మంది కళంకిత పోలీస్ అధికారులకు సిట్ క్లీన్‌చిట్ ఇచ్చింది. నయీంతో ఈ 25 మంది అధికారులకు సంబంధాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో వారిని తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నయీంతో వీరికున్న సంబంధాలపై సిట్ బృందం విచారణ జరిపింది. ఈ విషయంలో పోలీస్ అధికారుల పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో 25 మంది పోలీస్ అధికారులకు సిట్ క్లీన్‌చిట్ ఇచ్చింది.

దీనికి సంబంధించి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు రాష్ట్ర పోలీస్ శాఖ సమాధానమిచ్చింది. ఆరోపణలు ఎదుర్కోన్న వారిలో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలు ఉన్నారు. 

అడిషనల్ ఎస్పీలు:
శ్రీనివాసరావు
చంద్రశేఖర్

డీఎస్పీలు:
సీహెచ్ శ్రీనివాస్
ఎం. శ్రీనివాస్
సాయి మనోహర్
ప్రకాశ్ రావు
వెంకట నరసయ్య
అమరేందర్ రెడ్డి
తిరుపతన్న

సీఐలు:
మస్తాన్
రాజగోపాల్
వెంకటయ్య
శ్రీనివాస నాయుడు
కిషన్
ఎస్ శ్రీనివాస రావు
వెంకట్ రెడ్డి
మజీద్
వెంకట సూర్యప్రకాస్
రవి కిరణ్ రడ్డి
బలవంతయ్య
నరేందర్ గౌడ్
రవీందర్

కానిస్టేబుళ్లు

దినేష్
ఆనంద్ 
సాదత్ మియా 
బాలన్న