టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్: మరో ముగ్గురు అరెస్ట్,99కి చేరిన అరెస్టులు
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురిని సిట్ ఇవాళ అరెస్ట్ చేసింది
హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసులో బుధవారంనాడు మరో ముగ్గురిని సిట్ అరెస్ట్ చేసింది. దీంతో మొత్తం ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 99కి చేరింది. పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కు ఈ ముగ్గురు నిందితులు సహకరించినట్టుగా సిట్ గుర్తించింది. ఈ ముగ్గురి అరెస్ట్ తో టీఎస్‌పీఎస్‌సీలో అరెస్టైన వారి సంఖ్య 99కి చేరింది.
పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కు ఈ ముగ్గురు నిందితులు సహకరించినట్టుగా సిట్ గుర్తించింది. ఈ ముగ్గురి అరెస్ట్ తో టీఎస్‌పీఎస్‌సీలో అరెస్టైన వారి సంఖ్య 99కి చేరింది.ఈ ఏడాది మార్చి మాసంలో టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశం వెలుగు చూసింది. తొలుత టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయంలోని కంప్యూటర్లను హ్యాక్ చేశారనే ప్రచారం సాగింది.ఈ విషయమై బేగంపేట పోలీసులు విచారణ నిర్వహించారు. అయితే కంప్యూటర్లు హ్యాక్ కాలేదని పోలీసులు తేల్చారు. అయితే టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించే పరీక్ష పేపర్లు లీకైనట్టుగా గుర్తించారు. దీంతో ఈ విషయమై విచారణకు సిట్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
గత ఏడాది అక్టోబర్ మాసంలో టీఎస్‌పీఎస్ సీ పేపర్లు లీకైౌన విషయాన్ని సిట్ గుర్తించింది. దీంతో గత ఏడాది అక్టోబర్ మాసం నుండి జరిగిన పరీక్షలను టీఎస్‌పీఎస్ సీ రద్దు చేసింది. కొన్ని పరీక్షలను టీఎస్‌పీఎస్ సీ వాయిదా వేసింది. వాయిదా వేసిన పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు షెడ్యూల్ ను కూడ టీఎస్‌పీఎస్ సీ విడుదల చేసింది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలు కీలక నిందితులుగా సిట్ తేల్చింది. అయితే వీరిద్దరి నుండి పలువురికి ప్రశ్నాపత్రాలు చేరినట్టుగా సిట్ బృందం గుర్తించింది. అయితే ప్రశ్నాపత్రాలు చేతులు మారడంలో డబ్బులు కూడ పెద్ద ఎత్తున చేతులు మారినట్టుగా దర్యాప్తు సంస్థ గుర్తించింది. మరో వైపు ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై ఈడీకి ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
also read:టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్: మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని సిట్ కు హైకోర్టు ఆదేశం
ఈ కేసులో కీలక నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను ఈడీ అధికారులు విచారించారు. మరో వైపు టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్ జనార్ధన్ రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్ సహా ఇతర అధికారులను కూడ ఈడీ విచారించింది. ఈ కేసులో సప్లిమెంటరీ చార్జీషీట్ ను కూడ సిట్ దాఖలు చేయనుంది. ఈ కేసులో ఇంకా మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందనే ప్రచారం కూడ సాగుతుంది.
రాజశేఖర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఇదిలా ఉంటే ఈ కేసులో ఏ-2 నిందితుడు రాజశేఖర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు బుధవారంనాడు కొట్టివేసింది. ఇప్పటికే మూడు దఫాలు రాజశేఖర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. టీఎస్‌పీఎస్ సీ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలు కీలక నిందితులు.