తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  పేపర్ లీక్  కేసులో  ఇవాళ మరో  ముగ్గురిని  సిట్  బృందం  అరెస్ట్  చేసింది. 

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసులో మరో ముగ్గురిని సిట్ బృందం అరెస్ట్ చేసింది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో సురేష్ , రమేష్ , షమీమ్ లను సిట్ బృందం అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 12కి చేరింది. నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు సిట్ అధికారులు.