కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు మరణించారు. వివరాల్లోకి వెళితే.. సుజాత, సులోచన అనే ఇద్దరూ అక్కాచెల్లెళ్లు ఒకే వ్యక్తిని పెళ్లిచేసుకుని అందరూ కలిసి ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.

ఈ క్రమంలో ఆదివారం ఉదయం  కరీంనగర్-వరంగల్ హైవేపై శంకరపట్నం మండలం కొత్తగట్టు దగ్గర గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. దీంతో వీరి గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. స్ధానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.