సిరిసిల్ల రైలు బోగీల్లో చదువులు, ప్లాట్ ఫారాలపై పిల్లల ఆటలు

sircilla government school classrooms look like a train, veranda a platform
Highlights

ఆకర్షణీయంగా అందంగా ముస్తాబైన పాఠశాల, రంగు రంగుల బొమ్మలతో గదులు, రైలు బోగీ మాదిరిగా తయారయిన ఈ పాఠశాలను చూసి ఏ కార్పోరేట్ స్కూలో అనుకుంటే మీరు పొరపడినట్లే. ఇది మన తెలంగాణ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాల. మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలోని ఈ స్కూల్ ని సీఎస్ఆర్ ఫండ్ తో ఇలా ఆకర్షణీయంగా తయారుచేశారు.
 
ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉన్న దురభిప్రాయాన్ని రూపుమాపడానికి ఇలా పాఠశాల ఆవరణను, తరగతి గదులను అందంగా, ఆకర్షణీయంగా తయారుచేశారు. ఈ పాఠశాల ఫోటోలను స్వయంగా ఐటీ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ''నా జిల్లా సిరిసిల్లలో గవర్నమెంట్ స్నూల్ ని అందంగా తయారుచేశాం. ఈ పాఠశాలను మీరంతా లైక్ చేస్తారని భావిస్తున్నాను" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 

అయితే ఇలా వినూత్న పద్దతిలో నిర్మించిన పాఠశాలలు దేశవ్యాప్తంగా మరికొన్ని ఉన్నాయి. కేరళలోని ఆళ్వార్ స్కూల్ కూడా ఈ కోవకు చెందింది. అక్కడి ప్రభుత్వం విద్యార్థులను ఆకర్షించడానికి రైలు కోచ్ తరహాలో తరగతి గదులకు రంగులు వేశారు. దీంతో స్కూల్ మొత్తం ఓ రైలు మాదిరిగా కనిపిస్తుంది. ఇలా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులను ఆకర్షించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కేరళ ప్రభుత్వం ప్రయత్నించింది.

ఇక ఉత్తరాఖండ్  ప్రభుత్వ పాఠశాలకు చెందిన శిల్ప అనే విద్యార్థికి కూడా ఇలాంటి వినూత్న ఆలోచనే వచ్చింది. కానీ ఆమె ఆలోచన బుల్లెట్ ట్రైన్ లా చాలా పాస్ట్.ఆమె ఓ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించడానికి ఓ స్కూల్ మోడల్ ని రూపొందించింది. అయితే ఆమె సాధారణ రైలు మాదిరిగా కాదు ఏకంగా బుల్లెట్ ట్రయిన్ స్టైల్లో రూపొందించి స్టేట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ లో ప్రథమ బహుమతి సాధించింది.

loader