తెలంగాణ సిఎం కేసిఆర్ కు మంచిర్యాల సభలో మహిళల నుంచి షాక్ ఎదురైంది. సిఎం కేసిఆర్ ప్రసంగిస్తుండగా మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. సింగరేణిలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులు, వారి కుటుంబసభ్యులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కావాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వారిని పట్టుకుని సభ బయటకు తీసుకువెళ్లేందుకు ఇటు మహిళా పోలీసులు.. అటు మగ పోలీసులు ఎంతగా శ్రమించారో ఈ కింద ఉన్న వీడియో చూడండి.