Singareni Elections: ఎట్టకేలకు మోగిన సింగరేణి ఎన్నికల నగారా.. పోలింగ్ ఎప్పుడంటే..?
Singareni Elections: ఎట్టకేలకు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నగరా మోగింది. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. వచ్చే నెలలో ఎన్నికల జరుగనున్నాయి.

Singareni Elections: ఎట్టకేలకు సింగరేణి ఎన్నికల నగరా మోగింది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 28న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఎన్నికల నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు.
నామినేషన్ ప్రక్రియ అక్టోబర్ 6, 7 తేదీల్లో జరగగా.. నామినేషన్లను ఉపసంహరణకు అక్టోబర్ 9, 10 తేదీల్లో అవకాశం కల్పించారు. అనంతరం నామినేషన్ల పరిశీలన జరుగనున్నది. ఆ తరువాత సింబల్స్ కేటాయింపు జరుగనున్నది. ఇక అక్టోబర్ 28న పోలింగ్ జరుగనున్నది. అదే రోజు కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు.
వాస్తవానికి మే 22న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర కార్మిక సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. వివిధ కారణాలను చూపుతూ.. అప్పట్లో ఎన్నికలు వాయిదా వేశారు. ఈ తరుణంలో సింగరేణి యాజమాన్యం అభ్యర్థనను కూడా హైకోర్టు తిరస్కరించింది. అక్టోబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో హడావుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది.