Asianet News TeluguAsianet News Telugu

శంషాబాద్ సజీవదహనం కేసు: ఆమె నా భార్యే, వీడియో ఆధారంగా గుర్తింపు

డాక్టర్ ప్రియాంక రెడ్డిపై అత్యాచారం, హత్య జరిగిన అదే శంషాబాద్‌లో మరో మహిళ సజీవ దహనం ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది

siddulagutta burnt woman body case updates
Author
Hyderabad, First Published Dec 1, 2019, 5:15 PM IST

డాక్టర్ ప్రియాంక రెడ్డిపై అత్యాచారం, హత్య జరిగిన అదే శంషాబాద్‌లో మరో మహిళ సజీవ దహనం ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఆమె ఎవరో గుర్తించేందుకు దర్యాప్తును ప్రారంభించారు.

అయితే మంటల్లో కాలిపోయిన మహిళను ధూల్‌పేటకు చెందిన కవితా బాయిగా గుర్తించారు. ఆమెకు మతిస్థిమితం సరిగా లేదని... ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

Also Read:శంషాబాద్ లో మరో మహిళ హత్య: పోలీసుల అనుమానం ఇదే....

కవిత కోసం ఆమె కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. అయితే ఆమె భర్త సంతోష్‌ సింగ్‌కు అతని సోదరుడు సిద్ధులగుట్ట వద్ద మహిళ సజీవదహనానికి గురైన వీడియోను వాట్సాప్‌లో షేర్ చేశాడు.

వీడియో చూసిన సంతోష్ సదరు మహిళ చేతికి ఉన్న గాజులు, ముక్కు పుడక, కాళ్లకు ఉన్న చెప్పుల ఆధారంగా ఆ మహిళ తన భార్య కవితాబాయిగా గుర్తించాడు. అతనితో పాటు వీడియోను చూసిన కుమార్తెలు, కుటుంబసభ్యులు సైతం మంటల్లో కాలిపోయింది కవితగానే నిర్థారించారు.

ప్రియాంకరెడ్డి హత్య కేసు విచారిస్తున్న తరుణంలో మహిళ హత్యకు గురవ్వడం తెలంగాణ ప్రజలంతా ఆందోళనకు గురయ్యారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.  

హత్యకు గురైన మహిళ వయసు 35 సంవత్సరాల వయసు ఉండే అవకాశం ఉందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు పోలీసులు.  నిర్మానుష్య ప్రాంతమైన సిద్దులగుట్టలో మహిళ హత్యకు గురవ్వడంపై స్థానికంగా కలకలం రేపుతోంది.

అయితే కేసు విచారణలో భాగంగా పోలీసులు స్థానికులను ప్రశ్నించారు. అయితే స్థానికంగా ఉండే అర్చకులు తాను ఒక మహిళ తిరగడాన్ని గమనించినట్లు చెప్పుకొచ్చారు. ఆమె ఏడుస్తూ కనిపించిందని ఎందుకు ఏడుస్తున్నావని తాను అడగ్గా హిందీలో ఏదో చెప్పిందన్నారు. ఆమె ఏం చెప్పిందో తనకు అర్థం కాలేదన్నారు ఆలయ అర్చకులు. . 

Also read:శంషాబాద్‌లో మరో దారుణం: ప్రియాంక రెడ్డిలాగే మరో మహిళ సజీవదహనం

దాంతో పోలీసులు మహిళది హత్య కాదని ఆత్మహత్య అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె అర్చకులతో మాట్లాడిన తీరు చూస్తే ఉత్తరాదివాసిగా పోలీసులు భావిస్తున్నారు. ఇకపోతే సిద్దులగుట్ట సీసీ కెమెరాలను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios