సిద్దిపేట:  సిద్దిపేటలోని సురభి అంజన్ రావు ఇంట్లో సోదాలకు సంబంధించిన వీడియోను సిద్దిపేట సీపీ మంగఠవారం నాడు విడుదల చేశారు.సోమవారం నాడు దుబ్బాక అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రఘునందన్ రావు బంధువుల ఇళ్లపై పోలీసులు సోదాలు నిర్వహించారు. 

also read:ఈసీ నిబంధనల మేరకు నడుచుకొంటున్నాం: సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్

సిద్దిపేటలోని సురభి అంజన్ రావు ఇంట్లో పోలీసులు రూ. 18 లక్షల 65 వేల సీజ్ చేశామన్నారు. వీటిలో రూ. 5.87 లక్షలను బీజేపీ కార్యకర్తలు ఎత్తుకెళ్లారని సీపీ వివరించారు.

అంజన్ రావు ఇంట్లో తనిఖీలు చేసిన సమయంలో పోలీసులు వీడియో తీశారు.ఈ వీడియోను సీపీ మీడియాకు విడుదల చేశారు.అంజన్ భార్య ఈ డబ్బుల విషయమై మాట్లాడిన అంశాలను రికార్డు చేశారు. ఈ డబ్బులు ఎవరివని పోలీసులు ఆమెను ప్రశ్నించారు.

ఈ డబ్బులు మావేవనని ఆమె ఆ వీడియోలో చెప్పారు. తమకు ఎలాంటి వ్యాపారాలు లేవన్నారు. తన భర్త అంజన్ రావు ఈ డబ్బులను తీసుకొచ్చాడని ఆమె చెప్పారు. ఈ డబ్బులకు సంబంధించిన విషయంలో ఆడియో, వీడియో రికార్డులు కూడ ఉన్నాయని సీపీ మీడియాకు తెలిపారు.ఈ డబ్బులను తామే ఆ ఇంట్లో ఉంచామని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని సిద్దిపేట సీపీ తెలిపారు.పథకం ప్రకారంగా దాడి చేశారన్నారు సీపీ.