పోలీసు వాహనం బోల్తా పడి... ఎస్ఐ దుర్మరణం పాలైన సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. 


పోలీసు వాహనం బోల్తా పడి... ఎస్ఐ దుర్మరణం పాలైన సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. విధుల్లో పాల్గొనడానికి వెళ్తూ.. ఎస్ఐ ప్రమాదానికి గురయ్యారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పూర్తి వివరాల్లోకి వెళితే...యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై మధు(40) నల్గొండ జిల్లా కేంద్రంలో జరుగుతున్న పోలీస్ దేహదారఢ్య పరీక్షలకు విధుల్లో పాల్గొనేందుకు తన వాహనంలో వెళ్తున్నారు. సమీపంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ముందు ఆయన వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది. 

మాచారమందుకున్న నార్కట్‌పల్లి పోలీసులు హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకున్నారు. ఎస్ఐ, గన్ మెన్, డ్రైవర్లను నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. కాగా... చికిత్స పొందుతూ ఎస్ఐ కన్నుమూశాడు. మిగిలిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.