హైదరాబాద్:చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరెడ్డి కొడుకు అనిందిత్ రెడ్డి ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్‌తో శుక్రవారం నాడు జరిగింది. తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ఆర్దిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, అటవీ శాఖ మంత్రి జోగురామన్న తదితరులు  నూతన దంపతులను ఆశీర్వదించారు.

ఫ్యాషన్ డిజైన‌ర్‌గా పేరొందిన  శ్రియా భూపాల్‌‌కు సినీ నటుడు అక్కినేని అఖిల్‌కు తొలుత పెళ్లి నిశ్చయమైంది. అయితే ఈ పెళ్లి చివరి నిమిషంలో రద్దైంది.  టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కొడుకు అనిందిత్ రెడ్డి తో శ్రియా భూపాల్‌ వివాహం జరిగింది.

ఈ పెళ్లికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రముఖులు, పలువురు మంత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మరోవైపు పలువురు సినీ నటులు కూడ ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

అనిందిత్‌... సినీ నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు కజిన్.  దీంతో మెగా ఫ్యామిలీ ఈ పెళ్లిలో సందండి చేసింది. సూపర్ స్టార్ మహేష్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ కు శ్రియా వదిన దియా క్లోజ్ ఫ్రెండ్.  నమ్రతా పిల్లలతో పాటు ఈ పెళ్లివేడుకలో పాల్గొన్నారు. శ్రియా భూపాల్ ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి మనమరాలు.