శామీర్ పేట్ సెలబ్రిటీ రిసార్ట్ లోని విల్లా నెం.21లో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూస్తోంది.
హైదరాబాద్ : హైదరాబాద్ లోని శామీర్ పేట సెలబ్రిటీ రిసార్టులో కాల్పులు కలకలం సృష్టించాయి. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ కాల్పులు జరిగాయని తెలుస్తోంది. సిద్ధార్ఢ్ దాస్ అనే వ్యక్తిపై మనోజ్ కుమార్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. సిద్ధార్ఢ్ దాస్ భార్య స్మిత, మనోజ్ కుమార్ తో గత కొంతకాలంగా సహజీవనం చేస్తోంది.
సిద్ధార్ఢ్ దాస్ వైజాగ్ లో హిందూజా థర్మల్ పవర్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య స్మిత దాస్. వీరికి 2019 నుంచి విభేదాలు ఉన్నాయి. గత మూడేళ్లుగా సిద్ధార్థ్ భార్య స్మిత, మనోజ్ కుమార్ అనే వ్యక్తితో కలిసి ఉంటోంది. వీరిద్దరూ సాప్ట్ వేర్ బిజినెస్ చేస్తారు. మనోజ్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీకి యజమాని, స్మిత అందులో పార్టనర్ గా ఉంది.
అయితే, సిద్ధార్థ్, స్మితల ఇద్దరు పిల్లలు కూడా స్మితతో పాటే మనోజ్ కుమార్ దగ్గర ఉన్నారు. కాగా, పిల్లలను మనోజ్ కొడుతున్నాడని పిల్లలు తండ్రి సిద్ధార్థ కు ఫోన్ చేసి చెప్పడంతో ఆయన అడగడానికి వచ్చాడు. ఆ సమయంలో ముగ్గురి మధ్య చెలరేగిన వివాదం, ఘర్షణకు దారి తీసి.. మనోజ్, సిద్ధార్థ్ ను బెదిరించడానికి ఎయిర్ గన్ ను పేల్చాడు. దీంతో కలకలం చెలరేగింది.
దీనిమీద పోలీసులు మాట్లాడుతూ.. ‘భర్త బెదిరించడానికి ప్రయత్నించడంతో ఘర్షణ చెలరేగి, కాల్పులు జరిగాయని భార్య చెబుతోందని’ పోలీసులు అంటున్నారు. అయితే మనోజ్ దగ్గరున్న ఎయిర్ గన్ కు సంబంధించి పర్మిషన్లు ఏమున్నాయో తెలియదు. దీనివల్ల ఎలాంటి హానీ జరగదు. కేవలం ఇది ఎయిర్ మాత్రమే ఉంటుంది. బుల్లెట్లు ఉండవు. కాకపోతే ఇది ఆర్మ్ డ్ యాక్ట్ కిందికి వస్తుందా? లేదా? అనేది ఇంకా తెలియదు.
పిల్లల్ని పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి పంపించారు. అక్కడ కూడా కుమారుడు మనోజ్ తనను, చెల్లిని కొడుతున్నాడని ఫిర్యాదు చేశాడని సమాచారం. సిద్ధార్థ్, ఆయన భార్య స్మిత, మనోజ్ కుమార్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మనోజ్ దగ్గరున్న ఎయిర్ గన్ కు పర్మిషన్లు లేవని తెలుస్తోంది.
సిద్ధార్థ్ కొడుకు తండ్రికి మనోజ్ కొడుతున్నాడని ఫోన్లో ఫిర్యాదు చేయడంతో పిల్లల్నితనతో తీసుకువెళ్లడానికి అతను మనోజ్ ఇంటికి వచ్చాడు. అంతేకాదు గత కొంతకాలంగా మనోజ్ తన పిల్లలను తన దగ్గరికి పంపించమంటూ స్మితను అడుగుతున్నాడు. పిల్లలిద్దరి వయసు కుమారుడు 17, కూతురు 13యేళ్లు.
