Asianet News TeluguAsianet News Telugu

జగిత్యాలలో టీఆర్ఎస్ కి షాక్.. పార్టీని వీడిన సీనియర్లు

గత నెల సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ అదే రోజు 105 మంది టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో టిక్కెట్టు దక్కని వారు వేరే పార్టీలోకి మారిపోతున్నారు.

shock to trs in jagityala, seniors leaves the party
Author
Hyderabad, First Published Oct 15, 2018, 2:49 PM IST

జగిత్యాలలో టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేతలు ఇద్దరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జగిత్యాల జెడ్పీటీసీ నాగలక్ష్మీ, రాములు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. గత నెల సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ అదే రోజు 105 మంది టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో టిక్కెట్టు దక్కని వారు వేరే పార్టీలోకి మారిపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలైన కొండా సురేఖ, బొడిగె శోభ, మేడ్చల్ నుండి సుధీర్ రెడ్డి లకు తొలి జాబితాలో టిక్కెట్టు దక్కలేదు. తొలి జాబితాలో టిక్కెట్టు దక్కని కారణంగా కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
 
కాగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను పురస్కరించుకొని రాజకీయపార్టీలు తమ కార్యక్రమాలను వేగవంతం చేశాయి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను కేసీఆర్ 105 స్థానాల్లో పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇంకా 14 స్థానాలకు గాను అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 10వ తేదీ తర్వాత మిగిలిన 14 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios